ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం సరికొత్త రికార్డులని సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ జనాలని ఆశ్చర్యపరుస్తున్న జగన్ ప్రభుత్వం, ఆ సంచలన నిర్ణయాల వల్ల కోర్టులో మొట్టికాయలు మాత్రం బాగా తింటుంది. ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్ ప్రభుత్వం మాదిరిగా కోర్టుల్లో మొట్టికాయలు తినలేదనే చెప్పొచ్చు. ఒకసారి కాదు రెండుసార్లు కాదు…ఏకంగా వందసార్లు పైనే జగన్ ప్రభుత్వానికి కోర్టులు మొట్టికాయలు వేశాయి.

ఉదాహరణకు పంచాయితీలకు వైసీపీ రంగుల వేసే విషయంలో వరుసపెట్టి హైకోర్టు, సుప్రీం కోర్టులు జగన్ ప్రభుత్వానికి విపరీతంగా మొట్టికాయలు వేశాయి. ఇక కోర్టుల దెబ్బకు దిగి వచ్చిన జగన్ ప్రభుత్వం మళ్ళీ రంగులు మార్చింది. ఇలా ఒకటి అంటే అనేక అంశాల్లో జగన్ ప్రభుత్వానికి షాకులు తగిలాయి. ఇక తాజాగా ఇన్‌సైడర్ ట్రేడింగ్ విషయంలో ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ తగిలింది.

మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, ఆయన బంధువులపై..ఇన్‌సైడర్ ట్రేడింగ్, అవినీతి నిరోధక చట్టం కింద ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ఇక ఈ అంశంపై దమ్మాలపాటి కోర్టుకెళ్లారు. ఈ క్రమంలోనే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనేది ఎక్కడా జరగలేదని హైకోర్టు స్టే ఇచ్చింది. అంతటితో ఆగకుండా ప్రభుత్వం సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుని సుప్రీం కోర్టు సమర్ధిస్తూ… ఈ కేసుని నెల రోజుల్లోనే పూర్తి చేయాలని హైకోర్టుని ఆదేశించింది.

ఈ క్రమంలోనే హైకోర్టు దమ్మాలపాటితో పాటు మరికొందరిపై పెట్టిన కేసులని కొట్టేసింది. ఇక దమ్మాలపాటిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ని కూడా రద్దు చేసేసింది. ఇలా జగన్ ప్రభుత్వానికి అదిరిపోయే షాక్ తగిలింది. మొదట నుంచి వైసీపీ…అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూనే ఉంది. కానీ ఎక్కడా కూడా ఆ ఆరోపణలని రుజువు చేయలేకపోతుంది. మొత్తానికైతే కోర్టులో ఇన్నిసార్లు మొట్టికాయలు తిన్న రాష్ట్ర ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం రికార్డులు సృష్టించిందనే చెప్పొచ్చు.

Discussion about this post