రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఉన్మాదులు చెలరేగిపోతున్నారు. ఇటీవలే రమ్యశ్రీ ఉదంతం కళ్ళు ముందే కదులుతుంది. ఇక ఈలోపే మహిళలపై అనేక దాడులు జరిగాయి. అయితే మహిళలకు న్యాయం చేయడం కోసమే దిశ చట్టాన్ని తీసుకొచ్చినట్లు జగన్ ప్రభుత్వం చెబుతోంది. అసలు ఆడపిల్లకు అన్యాయం జరిగితే 21 రోజుల్లోనే న్యాయం చేస్తామని నిందితులని పట్టుకుని శిక్ష విధిస్తామని రాష్ట్ర హోమ్ మంత్రి సుచరిత పదే పదే చెబుతున్నారు.

మరి ఈ దిశ చట్టం ద్వారా 21 రోజుల్లోనే ఎంతమంది ఆడబిడ్డలకు న్యాయం జరిగింది? ఎంతమంది దుర్మార్గులకు శిక్ష పడింది? అని ప్రతిపక్ష టిడిపి ప్రశ్నిస్తుంది. అసలు దిశ చట్టం వల్ల ప్రయోజనం లేదని, జగన్ అధికారంలోకి వచ్చాక 500 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ఎన్ని కేసుల్లో నిందితులకు 21 రోజుల వ్యవధిలో ఉరి శిక్షలు వేయించారో చెప్పాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే క్రమంలో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే మహిళలతో రాసలీలు ఆడుతూ బయటకొచ్చిన ఆడియోలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే మొన్న ఆ మధ్య ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మంత్రి అవంతి శ్రీనివాస్‌ల పేరిట కొన్ని ఆడియోలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందులో మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ ఆడియోలు బయటకొచ్చాయి.

అయితే ఆ ఆడియోలు తమవి కాదని సదరు ఎమ్మెల్యే, మంత్రి వివరణ కూడా ఇచ్చారు. ఇవి ఎవరో కావాలని కుట్ర పన్ని చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ ఆడియోల విషయంలో పోలీస్ శాఖ ఇంకా ఏం తేల్చినట్లు కనిపించడం లేదు. ఒకవేళ ఆడియోలు వారివి కాదు అనుకుంటే…అసలు కుట్ర చేసిన వారినైనా పట్టుకోవాలి కదా? అని టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అప్పుడే ఇందులో నాయకుల ప్రమేయం లేదని తెలుస్తుందని అంటున్నారు. మరి అంబటి, అవంతిల ఆడియోల వ్యవరాహం ఎప్పుడు తెలుస్తారో క్లారిటీ రావడం లేదు.

Discussion about this post