రాయలసీమ జిల్లాల్లో వైసీపీ హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీకి తిరుగులేదు. గత రెండు ఎన్నికల నుంచి ఈ జిల్లాల్లో వైసీపీదే లీడింగ్. అయితే టిడిపి ఎంత ప్రయత్నించిన ఫ్యాన్ హవా తగ్గించలేకపోతుంది. ఈ జిల్లాల్లో ప్రతి పార్లమెంట్ పరిధిలో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తోంది. అసలు ఆ స్థానాల్లో టిడిపి ఏ మాత్రం వైసీపీకి చెక్ పెట్టలేకపోతుంది. ఇక వైసీపీకి ఏ మాత్రం చెక్ పెట్టలేని వాటిల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం కూడా ఒకటి.

కడప, చిత్తూరు జిల్లాల్లోని అసెంబ్లీ స్థానాలతో కలిసి ఉన్న రాజంపేట పార్లమెంట్ పరిధిలో వైసీపీ ఆధిక్యం స్పష్టంగా కొనసాగుతుంది. గత ఎన్నికల్లో పార్లమెంట్ స్థానంతో పాటు, పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్ళపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు స్థానాల్లో వైసీపీ గెలిచింది.

అయితే ఇప్పటికే రాజంపేట పార్లమెంట్ పరిధిలో వైసీపీ హవాని టిడిపి తగ్గించలేకపోతుంది. పైగా పెద్దిరెడ్డి ఫ్యామిలీ లీడ్ చేయడంతో ఈ పార్లమెంట్ స్థానంలో వైసీపీకి తిరుగులేకుండాపోతుంది. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పని చేస్తున్నారు. ఈయనకు టిడిపి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. ఇక పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టడం టిడిపి వల్ల కాదు.

అలాగే తంబళ్ళపల్లెలో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారనాథరెడ్డికి కూడా తిరుగులేకుండా పోయింది. ఆ నియోజకవర్గంలో కూడా ఇక వైసీపీని నిలువరించడం టిడిపికి సాధ్యమయ్యేలా లేదు. ఇక రాజంపేటలో మేడా మల్లిఖార్జున్ రెడ్డి స్ట్రాంగ్‌గానే ఉన్నారు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డికి చెక్ పెట్టడం కష్టమే. ఇకపోతే మదనపల్లె, పీలేరు, రైల్వే కోడూరుల్లో టిడిపికి కాస్త ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికైతే రాజంపేటలో ఫ్యాన్ హవా కొనసాగుతుంది.

Discussion about this post