ఏపీలో అధికార వైసీపీకి ఇప్పుడుప్పుడే వ్యతిరేక పవనాలు వీయడం మొదలవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేక పవనాలు వీయడంతోనే వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాగలిగింది. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ….అంతే స్థాయిలో ప్రజలకు అండగా ఉండటంతో విఫలమవుతుందని విశ్లేషణలు వస్తున్నాయి. ఏదో సంక్షేమ పథకాలు తప్ప, ప్రజలకు పెద్దగా ఒరిగిందేమీ కనబడటం లేదు. పైగా పన్నుల భారం ఒకటి అదనంగా పడుతుంది. అటు అభివృద్ధి కూడా శూన్యం…అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వాన్ని నడిపే పరిస్తితి కనిపిస్తోంది.

ఇవేగాక అనేక పరిస్తితులు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. పైగా కొందరు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని తెలుస్తోంది. అలా ప్రజా వ్యతిరేకత తెచ్చుకుంటున్నవారిలో ఒంగోలు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు అనుకున్న మేర ప్రజలకు అండగా ఉండటంలో విఫలమయ్యారనే అంటున్నారు.

ఉదాహరణకు దర్శిలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు అంత సానుకూలమైన వాతావరణం లేదని తెలుస్తోంది. అక్కడ వైసీపీలో గ్రూప్ తగాదాలు తారస్థాయికి చేరుకున్నాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లోనే ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది…ఏ నాయకుడుకు సపోర్ట్ ఇవ్వాలో. ఈ ఆధిపత్య పోరులో నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి శూన్యం. ఇలా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు నియోజకవర్గాల్లో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు. ఇక కొండపిలో టిడిపి ఎమ్మెల్యే ఉన్నారు.

అయితే ఇలా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ సిట్టింగ్ సీట్లలో ఆ పార్టీకి కాస్త వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని దాన్ని పాజిటివ్‌గా మలుచుకోలేని స్థితిలో టిడిపి ఇంచార్జ్‌లు కూడా ఉన్నారు. పైగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టిడిపి ఇంచార్జ్‌ల మధ్య అసలు సమన్వయం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ముందుకెళ్లడంతో ఒంగోలు పార్లమెంట్ పరిధిలో టిడిపి ఇంకా పికప్ కాలేకపోతుంది

Discussion about this post