రాయలసీమ…అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న ప్రాంతం. గత రెండు ఎన్నికల నుంచి సీమలో ఉన్న నాలుగు జిల్లాల్లో కాస్త వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. నాలుగు జిల్లాలు కలిపి 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో వైసీపీ 30 సీట్లు గెలుచుకుంటే, టీడీపీ 22 గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది. టీడీపీకి కేవలం 3 సీట్లు మాత్రమే వచ్చాయి. వైసీపీ ఈ రేంజ్‌లో గెలిచిందంటే అక్కడ ఆ పార్టీ ప్రభావం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి అంత అనుకూల వాతావరణం ఉండదని విశ్లేషణలు వస్తున్నాయి. సీమలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకిత పెరిగిందని అంటున్నారు. కాకపోతే ప్రభుత్వ పథకాలు మాత్రం వారికి ప్లస్ అవుతున్నాయని, అలాగే కొన్నిచోట్ల టీడీపీ నేతలు పుంజుకుంటే వైసీపీకి చెక్ పడటం ఖాయమని అంటున్నారు.
ఇప్పటికే తమ కంచుకోట జిల్లాలో టీడీపీ పుంజుకుందని, దాదాపు సగం సీట్లపైనే ఇక్కడ టీడీపీకి లీడింగ్ వచ్చిందని తెలుస్తోంది. ఇంకాస్త కష్టపడితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ హవా ఉండటం గ్యారెంటీ అంటున్నారు. అటు చంద్రబాబు సొంత జిల్లాలో కూడా టీడీపీకి అనుకూల వాతావరణం వస్తుందని, పలువురు నాయకులు ఇప్పుడుప్పుడే వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారని, పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకున్నారని చెబుతున్నారు. అటు వైసీపీకి అనుకూలంగా ఉన్న కర్నూలు జిల్లాలో సైతం టీడీపీకి కాస్త ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.
ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత పెరుగుతుందని, ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు యాక్టివ్ అయితే ఫలితం వేరుగా ఉంటుందని తెలుస్తోంది. ఇక కడప జిల్లాలో ఇంకా వైసీపీకే అనుకూల వాతావరణం కనిపిస్తుందని చెబుతున్నారు. కానీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకిత ఉందని, కాకపోతే జగన్ ఇమేజ్ ప్లస్ అవుతుందని, పైగా ఇక్కడ టీడీపీ నేతలు యాక్టివ్‌గా లేరని, అందుకే కడపలో వైసీపీకే లీడ్ ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లైతే ఈ సారి సీమలో జగన్‌కు అంత అనుకూల వాతావరణం అయితే లేదని చెప్పొచ్చు.
Discussion about this post