ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత ఆధిపత్య పోరు రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేందుకు చూస్తున్నారు. అలాగే వారి మధ్య గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ పరిణామాలు అధికార వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేసేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇదే సమయంలో వైసీపీలో ఉండే లుకలుకలు ప్రతిపక్ష టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలా వైసీపీలో ఆధిపత్య పోరు వల్ల టీడీపీకి బెనిఫిట్ అయ్యే నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా దర్శి ఒకటి.
ఇక్కడ అధికార వైసీపీలో చాలా గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు అసలు పొసగడం లేదు. గత ఎన్నికల్లో శివప్రసాద్ పోటీ చేయాల్సి ఉండగా, ఆర్ధిక పరిస్తితుల నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో టికెట్ దక్కించుకుని మద్దిశెట్టి గెలిచారు. ఇక వైసీపీ అధికారంలోకి రావడంతో బూచేపల్లి డామినేషన్ మొదలైంది. ఇటు ఎమ్మెల్యే కూడా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నారు. వీరు ఎవరికి వారే అన్నట్లు ముందుకెళుతున్నారు.
ఇదే సమయంలో మొన్నటివరకు దర్శి టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సైతం వైసీపీలోకి వచ్చారు. దీంతో నియోజకవర్గంలో మూడో వర్గం వచ్చింది. ఈ ముగ్గురు నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబూరావు కూడా వైసీపీలోకి వెళ్లారు. దీంతో టీడీపీకి పమిడి రమేష్‌ని ఇన్‌చార్జ్‌గా పెట్టారు.
ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి రమేష్ దూకుడుగా ఉంటున్నారు. నియోజకవర్గంలో సమస్యలపై పోరాటం చేస్తూనే, కార్యకర్తలకు అండగా ఉంటూ, వారిని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇలా టీడీపీ దర్శిలో నిదానంగా పుంజుకుంటుంది. అయితే వైసీపీలో ఉండే లుకలుకలు టీడీపీకి బాగా ప్లస్ అయ్యేలా ఉన్నాయి. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి అదే లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.
Discussion about this post