కమల్ హాసన్…జాతీయ ఉత్తమ నటుడు….నటనలో ఈయన మించిన వారు లేరనే దేశం మొత్తం చెబుతోంది. ఆయన తన నటనతో దేశ వ్యాప్తంగా ఎన్నో సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించడంతో పాటు ఎన్నో అవార్డులు సైతం సొంతం చేసుకున్నారు. కమల్‌హాసన్‌కు అందుకే లోక నాయకుడిగా పేరుంది. అయితే కమల్ హాసన్‌ని మించి వైసీపీ ఎంపీలు నటనలో ఇరగదీస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే గత రెండేళ్ల నుంచి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నటనతోనే పాలన చేస్తుందని పలువురు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పైకి ఏమో తాము జనం కోసం కష్టపడుతున్నామని, వారి బాగోగులే తమకు కావాలని చెబుతున్నారు.
కానీ వెనకేమో జనాలపై ఎన్ని రకాలుగా ఆర్ధికంగా భారం వేయాలో అన్నీ రకాలుగా వేస్తున్నారు. పైకి పథకాలు గొప్పగా అమలు చేస్తున్నామని అంటారు. కానీ అందులో ఉన్న లొసుగులు అన్నీ ఇన్ని కావు. ఆ విషయం పక్కనబెడితే ఇప్పుడు వైసీపీ ఎంపీలు సైతం ఢిల్లీ స్థాయిలో అద్భుతమైన నటన ప్రదర్శిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా ఎంపీలు…రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన సందర్భాలు లేవు. ప్రత్యేక హోదా, విభజన హామీలని పూర్తిగా గాలికొదిలేశారు. మరి ఏమైందోగానీ సడన్‌గా వారికి రాష్ట్రం మీద ప్రేమ పుట్టుకొచ్చేసింది. హోదా, విభజన హామీలపై పోరాటం చేస్తున్నారు.
అయితే అది చిత్తశుద్ధితో పోరాటం చేస్తే బాగానే ఉంటుంది. కానీ పార్లమెంట్ లోపలేమో తమకు చుక్కలు చూపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటు వేయాలని ప్లకార్డులు పట్టుకుంటున్నారు. కానీ మీడియా ముందుకొచ్చేసరికి హోదా, పోలవరం అంటూ బోర్డులు చూపిస్తున్నారు. ఇక దీని బట్టి చూస్తేనే వైసీపీ ఎంపీలు కమల్ హాసన్‌ని మించి నటిస్తూ, ఏపీ ప్రజలని మభ్యపెడుతున్నారని కామెంట్లు వస్తునాయి. ఏదేమైనా నటనలో వైసీపీ వాళ్ళ తర్వాతే ఎవరైనా అని అంటున్నారు.
Discussion about this post