ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. `తమ` అనుకున్న నాయకుడికి ఇక్కడి ప్రజలు వరుస విజయాలు అందిస్తూ.. నెత్తిన పెట్టుకుంటున్నారు. గతంలో బాచిన చెంచుగరటయ్యకు ప్రజలు వరుస విజయాలు అందించారు. ఈయన టీడీపీ నుంచి వరుసగా గెలిచారు. తర్వాత.. స్వతంత్రంగా పోటీ చేసినా.. గెలిపించారు. దీనికి కారణం.. వివాదాలకు దూరంగా.. ప్రజల సమస్యల పరిష్కారానికి దగ్గరగా ఉండే నేతలను.. అద్దంకి ప్రజలు నెత్తిన పెట్టుకోవడమే! ఇప్పుడు ఇదే మాట.. ప్రస్తుత ఎమ్మెల్యే గొట్టిపాటి రవి విషయంలో వినిపిస్తోంది.. కనిపిస్తోంది కూడా! గతంలో కాంగ్రెస్ నాయకుడిగా.. ఇక్కడ నుంచి పోటీ చేసిన రవి.. 2009లో విజయం దక్కించుకున్నారు.

అప్పటి సీఎం, దివంగత వైఎస్‌కు సన్నిహితుడిగా రవి మెలిగారు. ఈ క్రమంలోనే వైఎస్ అస్తమయంతో రవి.. ఆయన కుటుంబా నికి చేరువయ్యారు. ఆయన తనయుడు.. ప్రస్తుత సీఎం జగన్‌కు అత్యంత సన్నిహిత యువనేతగా గుర్తింపు పొందారు. అదేసమ యంలో ప్రజలకు కూడా చేరువయ్యారు. సమస్య ఎక్కడున్నా.. పార్టీలతో సంబంధం లేకుండా రవి.. వాటిని పరిష్కరించేందుకు దూకుడుగా ముందుకు పోతారనే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవడం.. వారి సమస్యలను ఓపికగా వినడం వంటివి.. రవికి రాజకీయంగా అబ్బిన విద్యగా ఇక్కడ ప్రచారంలో ఉంది. 2009లో కాంగ్రెస్, 2014లో వైసీపీ తరఫున వరుసగా విజయం దక్కించుకున్నారు.

అయితే.. కొన్నాళ్ల తర్వాత.. రాష్ట్ర అభివృద్ధితోపాటు, తన నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్న చంద్రబాబు పాలన పట్ల మక్కువ పెంచుకున్న రవి.. అనంతర కాలంలో టీడీపీకి సానుకూలంగా మారారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయిం చారు. ప్రతి సమస్యను వ్యక్తిగత సమస్యగా భావించే రవి.. ఎవరు ఏం చెప్పినా.. పరిష్కరించడం ఒక కర్తవ్యంగా పెట్టుకున్నారు. రాజకీయ విభేదాలు తప్ప.. వ్యక్తిగత విభేదాలకు చోటివ్వని రవి.. గత 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. ఆయన పట్ల ప్రజలు నిరాజనాలు పట్టారు. గత ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి కూడా విజయం అందించారు.

ప్రస్తుతం టీడీపీ అధికారంలో లేదు. పైగా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు,వ్యాపార పరంగా అధికారుల దాడులు పెరిగినా.. గొట్టిపాటి రవి మాత్రం.. ఎక్కడా సమస్యలకు, తనకు వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఇబ్బందులకు తల ఒంచడం లేదు. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన నిత్యం కృషి చేస్తూనే ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల నుంచి విరాళాలు సేకరిస్తూ.. పేదలు, బలహీన వర్గాలకు సాయం చేస్తున్నారు. అదేసమయంలో పార్టీ తరఫున కార్యకర్తలకు కూడా అండగా నిలుస్తున్నారు. నమ్మిన సిద్ధాంతానికి, ప్రజలు చూపిన అభిమానానికి ఆయన ఫిదా అవుతున్నారే తప్ప.. తాత్కాలిప ప్రలోభాలకు, బెదిరింపులకు ఆయన లొంగకపోవడం.. అద్దంకిలో రవి కిరణాలు.. అస్తమించవని చెప్పడానికి ఉదాహరణగా పేర్కొంటున్నారు ఆయన అభిమానులు.

Discussion about this post