అనంతపురం తెలుగుదేశం పార్టీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల రాయలసీమకు చెందిన టిడిపి నేతలంతా అనంతలో నీటి ప్రాజెక్టుల విషయంలో సమావేశం పెట్టుకున్నారు. ఇక అక్కడకు వచ్చిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి…సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు చేశారు. కార్యకర్తలని ఎవరూ పట్టించుకోవడం లేదని, అలాగే అనంతలో ఇద్దరు నాయకుల వల్ల టిడిపి నాశనమవుతుందని విమర్శించారు.

ఇక జేసి ఇలా మాట్లాడటంతో టిడిపి నాయకులు షాక్ అయ్యారు. అయితే వెంటనే జేసి ప్రభాకర్ రెడ్డికి…అనంత టిడిపి నేతలు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పల్లె రఘునాథ్ రెడ్డి, ప్రభాకర్ చౌదరీలు జేసిపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే పరిటాల సునీత, పయ్యావుల కేశవ్, జితేంద్ర గౌడ్, ఉమా మహేశ్వరనాయుడు లాంటి నాయకులు సైతం జేసి వ్యాఖ్యలని ఖండించారు. కానీ ప్రభాకర్, పల్లెలు మాత్రం జేసిపై ఫైర్ అయ్యారు. వైసీపీతో ములాఖత్ అయ్యి పార్టీకి నష్టం చేస్తుందో ఎవరో తెలుసని జేసిని ఉద్దేశించి మాట్లాడారు.

అలాగే ఒకోసారి జగన్‌ని పొగుడుతుంది ఎవరో కూడా తెలుసని, కార్యకర్తలని తాము బాగానే చూసుకుంటున్నామని ఆ విషయం జేసి చెప్పాల్సిన పని లేదని మాట్లాడారు. అయితే ఇలా జేసినే వైసీపీతో ములాఖత్ అయ్యారని అర్ధం వచ్చేలా పల్లె, ప్రభాకర్‌లు విమర్శించారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పల్లె, ప్రభాకర్‌లు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి.

పెద్దారెడ్డి ఇంట్లో పల్లె భోజనం చేస్తున్న ఫోటో ఒకటి, పెద్దారెడ్డితో ప్రభాకర్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలోకి వచ్చాయి. అంటే ఇప్పుడు వైసీపీతో ములాఖత్ అయింది ఎవరంటూ కొందరు టిడిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అయితే ఇలా టిడిపి నేతల మధ్య రచ్చ వల్ల పార్టీకే నష్టం జరిగేలా కనిపిస్తోంది. ఈ రచ్చకు చంద్రబాబు చెక్ పెట్టాల్సిన అవసరముందని కార్యకర్తలు మాట్లాడుతున్నారు.

Discussion about this post