అధికార వైసీపీలో ఫైర్ బ్రాండ్ మంత్రులు అంటే….మొదట వినబడే పేర్లు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్. ఈ ఇద్దరు నాయకులు ఏ స్థాయిలో తమ ఫైర్ చూపిస్తారో అందరికీ తెలిసిందే. అసలు ప్రత్యర్ధులపై ఏ విధంగా విరుచుకుపడతారో కూడా తెలిసిందే. అంటే ఫైర్ బ్రాండ్ నాయకులు అంటే పరుష పదజాలంతో ప్రత్యర్ధులని దూషించడమే అని ఈ ఇద్దరు మంత్రులు రుజువు చేశారని చెప్పొచ్చు.

ప్రతిపక్ష టిడిపి గానీ, ఇతర పార్టీల నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు కొడాలి, అనిల్‌లు వెంటనే రియాక్ట్ అయ్యి, వారికి కౌంటర్లు ఇచ్చేస్తారు. అది కూడా బూతుల విమర్శలతో. అదేంటి రాజకీయాల్లో నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలి గానీ ఇలా బూతులు మాట్లాడతారా? అంటే….తమ నాయకుడుని విమర్శిస్తే ఇలాగే సమాధానం చెబుతామనే విధంగా నాని, అనిల్‌ల వైఖరి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే సిఎం జగన్ మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటారు.

అంటే ఎంతలా వీరు ప్రత్యర్డులపై విరుచుకుపడతారో అర్ధమవుతుంది. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లని ఏ రకంగా దూషిస్తారో చెప్పాల్సిన పని లేదు. అసలు వీరు మంత్రులు అని కాకుండా కేవలం చంద్రబాబుని తిట్టడానికే ఉన్నట్లు ఉంటారు. అందుకే ఈ మంత్రులు ఏ శాఖలు నిర్వహిస్తున్నారో కూడా ప్రజలకు పెద్దగా అవగాహన ఉండదని, కేవలం వీరు బూతులు మంత్రులుగా ఉండిపోయారని టిడిపి శ్రేణులు విమర్శిస్తుంటాయి.

అయితే ఇలా ఫైర్ బ్రాండ్ మంత్రులుగా ఉన్న ఈ ఇద్దరు మధ్య కాస్త సౌండ్ తగ్గించారు. అసలు అనిల్ పోలిటికల్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. అటు కొడాలి నాని మునుపటిలా ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు రావడం లేదు. మరి ఈ ఇద్దరు మంత్రులకు సడన్‌గా ఏమైందో తెలియదు గానీ సౌండ్ మాత్రం చేయడం లేదు. అయితే ఈ ఇద్దరు మంత్రి పదవులు పోతున్నాయనే సంకేతాలు అందడం వల్లే సైలెంట్‌గా ఉంటున్నారని టిడిపి శ్రేణులు అంటున్నాయి. మరి ఈ ఫైర్ బ్రాండ్లు మళ్ళీ ఎప్పుడు ఫామ్‌లోకి వస్తారో చూడాలి.

Discussion about this post