తెలంగాణ-ఏపీల మధ్య నీటి వివాదం తీవ్రంగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం గళం విప్పిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్టు అక్రమమని చెప్పి, దాన్ని ఆపేయాలని తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారు. ఇటు ఏపీ ప్రభుత్వం సైతం, తెలంగాణ పలు అక్రమ ప్రాజెక్టులని కట్టిందని మాట్లాడుతుంది. అలాగే శ్రీశైలం, పులిచింతలలో తెలంగాణ ప్రభుత్వం పరిమితికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసి, నీటిని సముద్రంలో వృధాగా వదిలేస్తుందని ఏపీ విరుచుకుపడుతుంది. అలాగే తాజాగా ఏపీ వైసీపీ ఎమ్మెల్యే తెలంగాణ పరిధిలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు చూడటానికి వెళితే, అక్కడ తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు.
అయితే ఇదంతా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామా అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్, కేసీఆర్‌లు ఇలా నీటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని అంటున్నారు. ఇక ఈ నీటి వివాదంలోకి వైసీపీ, చంద్రబాబుని లాగే ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో పాలమూరు-రంగారెద్ద్, దిండి ప్రాజెక్టులని కట్టారని మంత్రి అనిల్ కుమార్ ఆరోపిస్తున్నారు. అలాగే రాయలసీమ ప్రాజెక్టుని ఆపేయాలని ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో లేఖ రాయించారని మండిపడుతున్నారు.రచ్చ చేస్తుంది వైసీపీనే అని, కావాలని ఇందులోకి చంద్రబాబుని లాగాలని చూస్తున్నారని మంత్రి అనిల్‌కు టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు రాయలసీమ ప్రాజెక్టుని ఆపేయాలని చెప్పలేదని, కానీ ప్రకాశం జిల్లాకు నష్టం జరుగుతుందని మాత్రం మాట్లాడారని అంటున్నారు. ఇక గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉండగా, తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల విషయంలో దీక్షలు, ధర్నాలు చేసి, అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పిలిచారని, అవే ప్రాజెక్టుల ఓపెనింగ్ వెళ్లారని గుర్తు చేస్తున్నారు.
అలాగే పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు పోరాడారని, అందుకే అప్పుడు తెలంగాణ మంత్రులు, చంద్రబాబుపై విమర్శలు చేశారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి నీటి వివాదంలో రచ్చ చేస్తుందే వైసీపీ అని, అందులోకి చంద్రబాబుని లాగాలని చూస్తున్నారని … బాబును విమర్శించడం సరికాదని అంటున్నారు.
Discussion about this post