వైసీపీ నేతలు ఒక్కరోజు కూడా చంద్రబాబు పేరు తలుచుకోకుండా మనశ్శాంతిగా నిద్రపోవడం కష్టమే అనుకుంటా. అసలు జగన్ దగ్గర నుంచి బడా, ఛోటా నేతల వరకు ప్రతి ఒక్కరూ చంద్రబాబు పేరు తలుచుకోవాల్సిందే. ఆయనపై విమర్శలు చేయాల్సిందే. రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా..అది చంద్రబాబు తప్పే అని చెప్పాల్సిందే. అసలు వైసీపీ నేతలు టైమ్‌కు భోజనమైన చేస్తున్నారో లేదో తెలియదు గానీ, టైమ్‌కు చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని టిడిపి శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి.

అసలు రాష్ట్రంలో ఏం జరిగిన చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై సెపరేట్‌గా ఎంత ట్యాక్స్ పెంచి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుందో అందరికీ తెలిసిందే. అయితే ఈ బాదుడు జగన్ ప్రభుత్వం బాదుతుంటే, వైసీపీ నేతలు మాత్రం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడానికి చంద్రబాబు కారణమని అంటారు.ఇక తాజాగా ట్రూ అప్ పేరిట జగన్ ప్రభుత్వం కరెంట్ చార్జీల బాదుడు మొదలుపెట్టింది. ఈ బాదుడుతో జనం ఘల్లుమంటున్నారు. ఇక ఎక్కడ ఇది తమకు వ్యతిరేకం అవుతుందో అని చెప్పి కరెంట్ బిల్లులు పెరగడానికి చంద్రబాబు కారణమని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇక రెండేళ్లుగా జగన్ ప్రభుత్వం రోడ్లని గాలికొదిలేసింది. దీంతో వర్షాల వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గుంతలు పడ్డాయి. అసలు రోడ్లకు మరమ్మతులు చేసే కార్యక్రమం కూడా వైసీపీ చేయలేదు. పైగా రోడ్లు దెబ్బతినడానికి కారణం చంద్రబాబు అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.

ఇక మద్యపాన నిషేధం జగన్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తుందో అందరికీ తెలిసిందే. భారీ ధరలకు నాసిరకం మద్యం అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ఇలా నాసిరకం మద్యం పెరిగిపోవడంతో, పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరా పెరిగిపోయింది. అలాగే బెల్ట్ షాపుల్లో వాటిని అమ్మేస్తున్నారు. అయితే చంద్రబాబే అక్రమ మద్యం అమ్మిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు లేకపోతే అసలు వైసీపీ నేతలు ఏమైపోయారో కూడా అర్ధం కావడం లేదని తెలుగు తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు.
Discussion about this post