జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పాటలు ప్రయాణిస్తున్నాడా ? చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టు.. పవన్ సైతం జనసేన ను బీజేపీ లో విలీనం చేయబోతున్నారా ?రు అంటే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాలకు కారణమవుతున్నాయి. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నాటి సమైక్య రాష్ట్రంలో కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో పాలకొల్లు – తిరుపతి లో పోటీ చేసిన చిరంజీవి సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓడిపోయి… తిరుపతిలో విజయం సాధించారు. ఆ తర్వాత తన పార్టీని నడపలేని చిరు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడంతో పాటు ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై… కేంద్ర సహాయ మంత్రిగా పని చేశారు.
నాడు చిరును నమ్ముకుని.. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఎంతోమంది రోడ్డు మీదకు వచ్చారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం అదే బాటలో పయనిస్తున్నారు. తాజాగా పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ పార్టీని నడపటం చాలా కష్టమైన పని అని… ఆయనా పార్టీని నడుపుతున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ మళ్లీ భీమవరం – గాజువాక వైపు చూడలేదు. అయితే ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే… పవన్ పార్టీని బిజెపిలో విలీనం చేస్తారా ? బిజెపి పవన్ కు రాజ్యసభ తో పాటు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తుందా ? వచ్చే మూడేళ్లలో ఈ పరిణామాలు జరుగుతాయా ? అని జనసేన వాళ్లే చర్చించు కుంటున్నారు.
ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రావడం కలే.. జనసైనికులకు కూడా ఈ విషయంలో ఆశలు లేవు. మళ్లీ పవన్‌ను నమ్ముకుంటే మళ్లీ నిండా మునగాల్సిందే. మళ్లీ చేతి చమురు వదిలించుకోవడం మినహా ఒరిగేది ఉండదు. అందుకే వాళ్లంతా రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కేడర్ చెల్లా చెదురు అవ్వడంతో పవన్ సైతం పార్టీ ఉండి ఉపయోగం లేదని.. బీజేపీలో విలీనం దిశగా ఆలోచన చేస్తున్నట్టు టాక్ ?
Discussion about this post