రాజకీయాల్లో ఉండేవారు ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి. అవి ఖచ్చితంగా అమలు చేసే ఉండాలి. అలా లేకపోతే ప్రజల నుంచి తిరస్కరణ రావడం ఖాయం. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పరిస్తితి కూడా అంతే. గత ఎన్నికలకు ముందు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో జగన్ వెనుకబడి ఉన్నారు. ఆయన అమలు చేసే పథకాల్లో ఏదొక లొసుగు ఉంటూనే ఉంది. ఇక కీలకమైన మద్యపాన నిషేదం విషయంలో మాత్రం జగన్ పూర్తిగా ప్రజలకు అబద్దమే చెప్పారని చెప్పొచ్చు. పాదయాత్ర సమయంలో అక్కాచెల్లెళ్ల బాధ చూసి దశలవారీగా మద్యపాన నిషేధం చేసేస్తానని హామీ ఇచ్చారు.
కానీ జగన్ అధికారంలోకి వచ్చాక దశలవారీగా మద్యం రేట్లు పెంచుకుంటూ పోతూ, ప్రజల నడ్డి విరుస్తున్నారు. అలాగే ప్రభుత్వమే వైన్స్‌ని నడుపుతున్న విషయం తెలిసిందే. అటు నాసిరకం మద్యాన్ని వైన్స్‌లో పెట్టి అమ్మేస్తున్నారు. గతంలో అక్కాచెల్లెళ్ల బాధని చూసి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్, ఇప్పుడు మద్యం రేట్లు పెంచి, నాసిరకం మద్యం అమ్ముతూ, ఆ అక్కాచెల్లెళ్ల బాధని మరింత పెంచారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప మద్యపాన నిషేదం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. పథకాల పేరిట డబ్బులు ఇస్తూ, వాటిని మద్యం రూపంలో లాగేస్తున్నారు.
ఇక ఈ వైన్స్‌లో జరిగే అక్రమాలు కోకొల్లలు అని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. వైన్ షాపుల పేరిట ప్రభుత్వ సొమ్ముని వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అలాగే మద్యం షాపుల్లో ఉద్యోగాల పేరిట వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చి,వారికి వేలకు వేలు ప్రభుత్వ సొమ్ముని జీతాల రూపంలో ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలా అన్నీ రకాలుగా జగన్ ప్రభుత్వం మద్యపాన నిషేధం విషయంలో ప్రజలని మోసం చేస్తుంది. ఇక జగన్ అన్న ఎప్పుడు మద్యపాన నిషేధం చేస్తారో అని అక్కాచెల్లెళ్ళు ఎదురుచూస్తున్నారు.
Discussion about this post