గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏ విధంగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. ప్రతి అంశాన్ని నెగిటివ్ చేయడమే లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఉండేవారు. ఆఖరికి చంద్రబాబు తాగే మంచి నీళ్ళ బాటిల్‌పై కూడా నెగిటివ్ చేసి వైసీపీ లబ్ది పొందింది. అలాగే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చిన జగన్, చంద్రబాబు కంటే గొప్పగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారా? అంటే అసలు కాదనే అంటున్నారు తమ్ముళ్ళు. ప్రతి రంగంలోనూ జగన్ వెనుకడుగే వేస్తున్నారని, ఓ రకంగా చెప్పాలంటే ప్రజలని ఆర్ధికంగా నడ్డివిరిచి పాలన చేస్తున్నారని చెబుతున్నారు.
అయితే గతంలో బాబుపై అన్నీ రకాలుగా విమర్శలు చేసి, ఇప్పుడు జగన్ ప్రజలని నిలువన ముంచేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో జగన్ అప్పుడొక రకంగా , ఇప్పుడొక రకంగా చేస్తున్నారని చెబుతున్నారు. అప్పటిలో రైతులు ధాన్యం ఇవ్వగానే 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు పడేవి. లేదంటే ఒక రెండు, మూడు రోజుల్లో డబ్బులు వచ్చేవి, అలా వచ్చినా సరే సీఎం జగన్, రైతుల ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదని జగన్ గగ్గోలు పెట్టేవారు. కానీ ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక వారం రోజులు కాదు కదా, నెల రోజులు దాటిన రైతులకు ధాన్యం డబ్బులు రాలేదు.
కొందరికైతే మూడు నెలలు అవుతున్న కూడా ధాన్యం డబ్బులు పడలేదని రైతులు, వైసీపీ ఎమ్మెల్యేలని నిలదీస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తోన్న రైతులను ఎమ్మెల్యేలు పబ్లిక్ గానే బెదిరిస్తున్నారు. కనీసం తమకు ఇబ్బంది ఉందని ఎమ్మెల్యేలకు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ఖరీఫ్ పనులు మొదలైన సరే రబీ డబ్బులు అందలేదు. అంటే ఏపీలో రైతుల పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అప్పుడు చంద్రబాబుని నిలదీసిన జగన్, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రైతులని దారుణంగా మోసం చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
Discussion about this post