ఏపీకి రాజధాని అన్నది లేదు. ఇది నిష్టుర సత్యం, నిక్కమైన నిజం కూడా. ఏపీకి మూడు రాజధానులు అంటూ హడావుడి చేసిన వైసీపీ ఇపుడు గమ్మున ఉంది. మరో వైపు అమరావతి లాంటి రాజధానిని రెండున్నరేళ్ల కాలంలో కనీస మాత్రంగా కూడా అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేసింది. కొద్దో గొప్పో నిధులు వెచ్చిస్తే ఏపీకి అంటూ ఒక చక్కని రాజధాని ఉండేది అన్నది నిజం. కానీ అలా కాకుండా మూడు రాజధానులు, మూడు ప్రాంతాలు అంటూ వైసీపీ ఎంచుకున్న రాజకీయ ఎత్తుగడ బెడిసి కొట్టింది. అదంతా కూడా వట్టి మాటలే అని అటు ఉత్తరాంధ్రాతో పాటు ఇటు రాయలసీమ వాసులు కూడా గ్రహించారు.

దాంతో పాటు మూడు రాజధానులకు అనుగుణంగా ఒక అడుగు కూడా ముందుకు పడడంలేదు. దీంతో ఇపుడు అమరావతి అన్న అంశమే టీడీపీకి చక్కని ఆయుధంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. నిజానికి ఏపీలోని మూడు ప్రాంతవాసులకు రాజధాని మీద మోజు అయితే లేదు. అది ఎక్కడ ఉన్నా కూడా అభివృద్ధి ఫలాలు అందరికీ పంచితే చాలు అనే వారు చూశారు. కానీ ఇపుడు జగన్ సర్కార్ మాత్రం దాన్ని ఉల్టా సీదా చేసేసింది. దాంతో అమరావతి డిమాండ్ ఇపుడు ప్రజల నుంచి కూడా వస్తోంది. ఏపీకి మూడు రాజధానులు అన్నది జరగదు అని తెలిసినపుడు కచ్చితంగా అందరి ఓటూ అమరావతి రాజధానికే పడుతుంది.

దాంతో అది టీడీపీయే ప్లస్ అవుతుంది అంటున్నారు అంతా. చంద్రబాబు కూడా తాను ఏపీకి ఉన్నాను అన్న ఒక్క మాటతో జనంలోకి వెళ్తే చాలు. మిగిలిన పని వారే పరిపూర్తి చేస్తారు అని కూడా వినిపిస్తోంది. ఒక ప్రభుత్వం అంటే అభివృద్ధి చూడాలి.భావి తరాలకు భరోసా కల్పించాలి. ఆ దిశగా ఆలోచనలు ప్రణాళికలు వైసీపీకి లేవు అని తేలుతున్న వేళ కచ్చితంగా టీడీపీయే బెస్ట్ చాయిస్ అవుతుంది అని అంటున్నారు ఈ నేపధ్యంలో తమ్ముళ్ళు కనుక గట్టిగా పట్టుపడితే ఏపీలో రాజకీయం మళ్ళీ టీడీపీ సైడ్ తీసుకోవడం ఖాయమే..!
Discussion about this post