అమరావతి రాజధాని మీద ప్రస్తుత వైసీపీ నేతల వైఖరి ఎలా ఉంది అంటే చెప్పిన ఆవు కధనే మళ్లీ మళ్లీ మొదటి నుంచి చెబుతున్నారని అంటున్నారు. అమరావతిలో రాజధాని ఉండడం ఇష్టం లేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని అభిప్రాయపడుతున్నారు. రాజధాని ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి కొత్తగా కొన్ని ఆరోపణలు అమరావతి రాజధాని మీద చేసిన సంగతి తెలిసిందే. దళితుల భూములను అన్యాయంగా కొనుగోలు చేశారని, వారికి హక్కులు లేకుండా చేశారని రాజ్యాంగం, చట్టం, న్యాయం అంటూ చాలానే చెప్పుకొచ్చారు.
అయితే ఇవన్నీ పాత కధలే తప్ప కొత్త పాయింట్ ఏదీ అని విపక్షాలు అంటున్నారు. అమరావతి మీద బురద జల్లుతున్న వైసీపీ నేతలు ఒక లాజిక్ ని మరచిపోతున్నారు అంటున్నారు. ప్రభుత్వం రెండేళ్ళుగా మీ చేతులలో ఉంది. ఇంతవరకూ ఆరోపణలు తప్ప ఒక్కటి అయినా నిరూపించలేకపోయారు కదా అని తెలుగు తమ్ముళ్ళు కూడా అంటున్నారు. అది పాయింటే కదా మరి అన్నది మేధావుల మాటగా ఉంది. అమరావతిలో వేల కోట్ల స్కామ్ అంటూ వీలు చిక్కినపుడల్లా మీడియా ముందుకు వచ్చి ఘాటు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు ఒక్క ఆరోపణ అయినా ఇప్పటిదాకా ఎందుకు రుజువు చేయలేకపోయారు అన్న ప్రశ్న అయితే ఉంది.
అమరావతి విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం ద్వారా ఏపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం తప్ప మరేమీ ఒనకూడదని కూడా అంటున్నారు. అమరావతి విషయంలో ఏదో రకమైన ప్రచారం చేస్తూ జనాల దృష్టిని ఏమార్చడం తప్ప సాధించింది ఇంతవరకూ ఏముంది అంటున్నారు. మరి అన్ని ఆధారాలు ఉన్నాయి సమగ్రమైన దర్య్పాప్తు జరుగుతోంది అంటున్న వైసీపీ నేతలు మాత్రం అ అంటే అమరావతి, ఆ అంటే ఆవు అని మాత్రమే చెప్పి అక్కడితో ఆగిపోతున్నారు. దీనికి బట్టి ఇదంతా రాజకీయ రాద్ధాంతం తప్ప మరేమీ కాదని అరధమైపోతోంది కదా అన్నదే విపక్షాల లా పాయింట్ మరి.
Discussion about this post