రాష్ట్రంలో ఎక్కడకక్కడ తెలుగుదేశం పార్టీ నేతలు యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. పార్టీని మళ్ళీ ఎలాగోలా గాడిలో పెట్టి నెక్స్ట్ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ స్థానంలో అధ్యక్షులు దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టారు. కానీ ఎవరు ఎలా పనిచేసిన మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ మాత్రం ఫీల్డ్‌లోకి దిగడం లేదు.

అసలు ఈయన పార్లమెంట్ అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి పార్టీ బలోపేతానికి ఒక్క పని అంటే ఒక్క పని కూడా చేయలేదు. అసలు పార్టీ తరుపున నిరసన కార్యక్రమాలు కూడా కొనకళ్ళ చేయడం లేదు. అసలు అందుకే మచిలీపట్నం పరిధిలో ఇంకా టిడిపి వీక్‌గానే కనిపిస్తోంది. మచిలీపట్నం అసెంబ్లీలో మాత్రం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దూకుడుగా పనిచేస్తున్నారు. అటు పెనమలూరులో బోడే ప్రసాద్ కూడా బాగానే పనిచేసుకుంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో నాయకులు సరిగ్గా పనిచేయడం లేదు.

ఇటు అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్, పామర్రులో ఉప్పులేటి కల్పనలు అంత యాక్టివ్‌గా లేరు. గన్నవరంలో బచ్చుల అర్జునుడు కూడా దూకుడుగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. ఇక గుడివాడలో చెప్పాల్సిన పని లేదు. అక్కడ రావి వెంకటేశ్వరరావు పెద్దగా కనిపించడం లేదు. పెడనలో కాగిత కృష్ణప్రసాద్ పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు. అయితే ఎక్కడకక్కడ నాయకులని యాక్టివ్ చేసి, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కొనకళ్ళది.

కానీ ఆయన మాత్రం ఆ పని చేయడం లేదు. ఇంతవరకు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన సందర్భం లేదు. ఈయన ప్రతి నియోజకవర్గంలో తిరిగి పార్టీ పరిస్తితిని చక్కదిద్దే ప్రయత్నాలు కూడా చేయట్లేదు. ఇక ఇలాగే పరిస్తితి కొనసాగితే, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో టిడిపికి మళ్ళీ షాకులు తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకనుంచైనా నారాయణ యాక్టివ్ అయ్యి, నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేస్తే బెటర్…లేదంటే అంతే సంగతులు.

Discussion about this post