అవంతి శ్రీనివాస్…ఇంతకముందు ఈ పేరు పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. వైసీపీలో మంత్రి అయ్యాక కాస్త అవంతి జనాలకు తెలియడం మొదలైంది. పైగా ఇటీవల ఆయనకు సంబంధించిన కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అవంతి రాష్ట్రమంతా ఫేమస్ అయ్యారు. ఆ ఆడియోల్లో ఎంత నిజం ఎంత ఉందో తెలియదు గానీ, అవి బాగా వైరల్ అయ్యి అవంతి మాత్రం బాగా హైలైట్ అయ్యారు.

ఆ విధంగా అవంతి అలా బుక్ అయిపోయారు. అలానే కాకుండా రాజకీయంగా కూడా అవంతి అనవసరంగా బుక్ అయిపోతున్నారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరిట హడావిడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు రాజధానులని ప్రతిపక్ష టిడిపి వ్యతిరేకిస్తుంది. దీంతో చంద్రబాబుని రాజధాని పేరిట ఇరుకున పెట్టాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మంత్రి అవంతి… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని ప్రశ్నిస్తున్నారు.ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రని పట్టించుకున్నారా అని ఫైర్ అయిన అవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు. అయితే వైసీపీ మంత్రిగా అవంతి ఇలా మాట్లాడటంలో తప్పు లేదని, కానీ అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని అవంతి..టిడిపిలో ఉండగా ఎందుకు చెప్పలేకపోయారని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు.

టిడిపి అధికారంలో ఉండగా ఎంపీగా ఉన్న అవంతి, అప్పుడు అమరావతి రాజధానిగా పెడుతుంటే ఎందుకు నోరు మెదపలేదని అడుగుతున్నారు. ఇక టిడిపిలో ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్న అవంతికి…ఉత్తరాంధ్రలో చంద్రబాబు చేసిన అభివృద్ధి కనిపించకపోవడం కాస్త వింతగానే ఉందని అంటున్నారు. మొత్తానికైతే అవంతి ఎలా మాట్లాడిన బుక్ అయిపోయేలా కనిపిస్తున్నారు.
Discussion about this post