గత ఎన్నికల్లో బలంగా వీచిన జగన్ గాలిని తట్టుకుని టీడీపీ తరుపున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. ఆ 23 మందిలో గద్దె రామ్మోహన్ కూడా ఉన్నారు. విజయవాడ తూర్పు నుంచి రామ్మోహన్…మంచి మెజారిటీతో విజయం సాధించారు. అయితే 2014లో కూడా రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలిచి, ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరిస్తూ, నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారు. అందుకే 2019 ఎన్నికల్లో గద్దెని తూర్పు ప్రజలు మరొకసారి గెలిపించారు.

అయితే ఈ సారి టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో గద్దెకు పెద్దగా నిధులు అందడం లేదు. అందుకే గతంలో మాదిరిగా దూకుడుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతున్నారు. అలా అని గద్దె ప్రజల్లో లేకుండా ఉండటం లేదు. నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలని తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం నిధులు అందకపోయిన, ఎంపీ కేశినేని నాని తీసుకొచ్చే పార్లమెంట్ నిధులు ద్వారా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు.

ఇలా గద్దె….తూర్పు ప్రజలకు అండగా నిలబడుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి తూర్పు ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్న దేవినేని అవినాష్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉండటంతో అనుకున్న మేర పనులు చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుని నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. ఇక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు…అవసరమైతే సొంత డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారు.

ఇలా అవినాష్ నియోజకవర్గంలో పనిచేయడంతో….రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒక్కసారిగా గద్దెకు అవినాష్ టఫ్ ఫైట్ ఇచ్చే స్థాయికి వచ్చేశారు. పైగా విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలో తూర్పు పరిధిలో ఉన్న ఎక్కువ డివిజన్లు వైసీపీనే గెలుచుకుంది. అయితే అవినాష్ పికప్ అయినా సరే గద్దెపై ప్రజల్లో వ్యతిరేకత ఏం లేదు. అంటే ఇద్దరు నాయకులు పోటాపోటిగా ఉన్నారని చెప్పొచ్చు. ఈ పరిస్తితి బట్టి చూస్తే ఈ సారి వచ్చే ఎన్నికల్లో తూర్పులో గద్దెకు అవినాష్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

Discussion about this post