వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడిపి నేతలని ఏ విధంగా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసిందో అందరికీ తెలిసిందే. అసలు జగన్ ప్రభుత్వం వచ్చాక అనేక మంది టిడిపి నేతలు, కార్యకర్తలపై కేసులు వచ్చి పడ్డాయి. అలాగే పలువురు జైలుకు కూడా వెళ్లొచ్చారు. వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా కొందరి నాయకులు టార్గెట్ చేసి మరీ జైలుకు పంపుతుందని అర్ధమవుతుంది. ఇలా టిడిపి నాయకులని ఇబ్బందులకు గురి చేస్తున్న వైసీపీ ప్రభుత్వం….టిడిపి సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుని ఎంతలా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూసినా సరే, కోర్టులు నుంచి వస్తున్న న్యాయం ద్వారా అశోక్ వైసీపీకి ఎదురు నిలబడగలుగుతున్నారు. అయినా సరే అశోక్‌ని ఎలాగైనా జైలుకు పంపించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నట్లు కనిపిస్తోంది. అసలు మొదట నుంచి విజయసాయి టార్గెట్…అశోక్‌పైనే. ఎలాగైనా అశోక్‌ని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పీఠం నుంచి దింపేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

అలాగే ఆయనపై భూ అక్రమాల ఆరోపణలు చేస్తూ, ఆయన్ని జైలుకు పంపిస్తానని విజయసాయి మాట్లాడుతున్నారు. అయితే విజయసాయి రాజకీయాన్ని అశోక్ కూడా గట్టిగానే ఎదురుకుంటున్నారు. ఎంతో సౌమ్యంగా ఉండే రాజు గారు కూడా, తనలో ఉన్న పౌరుషాన్ని బయటపెడుతున్నారు. తాజాగా కూడా విజయసాయికి ఊహించని రీతిలో కౌంటర్లు ఇస్తున్నారు. 846 ఎకరాల దేవస్థాన భూమిని అశోక్ అన్యాక్రాంతం చేశారని, వేల కోట్లు దోచుకున్నారని విజయసాయి ఆరోపిస్తున్నారు.

మాన్సాస్ ప్రైవేటు ఆస్తి కాదని.. అది ప్రజల ఆస్తి అని, సింహాచలం భూములు 846 ఎకరాలు మాయమయ్యాయని విజయసాయిరెడ్డి ఆరోపిస్తున్నారని, ఆధారాలు ఉంటే చూపించాలని అశోక్ డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నారు కాబట్టి సర్వే నంబర్లతో సహా బయటపెట్టాలని అశోక్ అడుగుతున్నారు. అయితే తనను జైలుకు పంపుతామని తరచూ ప్రకటిస్తున్నారని, విజయసాయిరెడ్డికి జైలంటే బాగా ఇష్టమనుకుంటా అని అశోక్ కౌంటర్లు ఇస్తున్నారు.

బెయిల్‌పై బయటకు వచ్చిన వారు నీతులు చెబుతున్నారని అశోక్ ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా గజపతి ఫ్యామిలీ దానం చేసిన భూముల్లోనే అశోక్ అక్రమాలు చేశారని విజయసాయి రెడ్డి మాట్లాడటం కాస్త విడ్డూరంగానే ఉందని చెప్పొచ్చు. అంటే ఎలాగోలా అశోక్‌ని ఇరికించాలని విజయసాయి గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది.

Discussion about this post