కృష్ణా జిల్లా సరిహద్దు నియోజకవర్గంగా ఉన్న అవనిగడ్డలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్నాయి. మొన్నటివరకు ఈ నియోజకవర్గంలో వైసీపీకే కాస్త బలం ఉందనే చెప్పొచ్చు. కానీ నిదానంగా ఇక్కడ పరిస్తితి మారుతుంది. ఈ పరిస్తితికి అనుగుణంగా టీడీపీ నేత మండలి బుద్దప్రసాద్ పనిచేస్తే పార్టీ సెట్ అయిపోతుందనే చెప్పొచ్చు.
గత ఎన్నికల్లో వైసీపీ తరుపున సింహాద్రి రమేష్ బాబు మంచి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. టీడీపీ బుద్దప్రసాద్‌పై 20 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యే అయిన రమేష్….ఏదో అలా అలా పనిచేస్తూ ముందుకెళుతున్నారు. ఈయనకు ప్రభుత్వ పథకాలు తప్ప మరొక్కటి ప్లస్ లేదు. పైగా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. ఇక్కడ రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా ఉంది. టీడీపీ హయాంలో మాత్రం మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి.ఇప్పుడు అలాంటిదేమీ జరగడం లేదు. అలాగే నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న రైతులకు ఒరిగిందేమీ లేదు. దీంతో వైసీపీపై నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాపులు, వైసీపీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వీరు వైసీపీకే ఎక్కువ మద్ధతు ఇచ్చారు. దీంతో ఆ పార్టీకి విజయం దక్కింది. కానీ ఈ సారి వీరు వైసీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జనసేన-టీడీపీ గానీ కలిస్తే మాత్రం అవనిగడ్డలో వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని అంటున్నారు.
ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ మీద వైసీపీకి 20 వేల మెజారిటీ వస్తే, జనసేనకు 28 వేల ఓట్లు వచ్చాయి. ఒకవేళ పొత్తు లేకపోయినా సరే జనసేనకు ఎలాగో గెలిచే ఛాన్స్ రాదని చెప్పి, టీడీపీ వైపుకు మొగ్గు చూపే ఛాన్స్ ఉంది. అందుకే టీడీపీ నేత మండలి కాస్త ఫోకస్ పెట్టి నియోజకవర్గంలో పని చేస్తే బెనిఫిట్ ఉంటుందని చెప్పొచ్చు.
Discussion about this post