అధికారంలో ఉంటే ఏదైనా చేసుకోవచ్చని విషయాన్ని వైసీపీ ఎప్పటికప్పుడు రుజువు చేస్తూనే ఉంది. తాజాగా ఒక సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. టిడిపి శాసనసభాపక్ష ఉప నేతలు కె.అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు అసెంబ్లీలో మైకు ఇవ్వకూడదని ప్రివిలేజ్ కమిటీ సంచలన నిర్ణయించింది. సిఎం జగన్‌ని దూషించారని ఆరోపిస్తూ.. వారిద్దరికీ ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకు మాట్లాడే అవకాశమివ్వకూడదని అధికార పార్టీ సభ్యులు ప్రతిపాదించారు.

మరి వైసీపీ తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్‌గా ఉంది? అంటే అచ్చెన్న, నిమ్మల అంటే భయపడుతున్నారు కాబట్టే, వైసీపీ ఇలాంటి నిర్ణయం తీసుకుని దాన్ని కరెక్ట్ అనుకుని సమర్ధించుకునే పరిస్తితిలో ఉందని టిడిపి నేతలు అంటున్నారు. అసలు అసెంబ్లీలో దూషణలకు దిగేది ఎవరో అందరికీ తెలుసు. అలాగే బయట మీడియా ముందుకొచ్చి బూతులు మాట్లాడేది ఎవరో కూడా తెలుసు. ఒక ప్రతిపక్ష నాయకుడుని ఇష్టారాజ్యంగా ఎవరు తిడతారో కూడా తెలుసు.

అలాంటిది ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నించిన అచ్చెన్న, నిమ్మలకు మైక్ ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోవడం వైసీపీ విజ్ఞతకే వదిలేయోచ్చని టిడిపి నేతలు మాట్లాడుతున్నారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రామానాయుడిని డ్రామానాయుడని సీఎం జగన్ అన్నారు. ఆ వెంటనే రామానాయుడు కూడా తిరిగి జైలురెడ్డి అన్నారు. ఇప్పుడు ఇదే మాట రామానాయుడుకు మైక్ ఇవ్వకపోవడానికి కారణమైందని తమ్ముళ్ళు చెబుతున్నారు.

అటు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని అచ్చెన్న గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని సాకుగా చూపించి..ఆయనకు మళ్ళీ మైక్ ఇవ్వకూడదని నిర్ణయించారు. అలా అంటే బూతులు మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల మైక్ జీవితాంతం కట్ చేయాల్సి ఉంటుందిగా అని టిడిపి శ్రేణులు అడుగుతున్నాయి. ఏదేమైనా అచ్చెన్న, నిమ్మలలు స్ట్రాంగ్‌గా మాట్లాడతారని వాళ్ళని సైడ్ చేసినట్లు కనిపిస్తోంది.

Discussion about this post