టీడీపీ మీద వ్యతిరేకిత కావొచ్చు, జగన్ గాలి కావొచ్చు గత ఎన్నికల్లో చాలామంది నాయకులు వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. వ్యక్తిగత ఇమేజ్ కంటే ఈ రెండు కారణాలే వైసీపీ తరుపున ఎక్కువమంది ఎమ్మెల్యేలు గెలవడానికి కారణమని చెప్పొచ్చు. పైగా కొందరు తక్కువ మెజారిటీలతో బయటపడిపోయారు. ఇక అలా తక్కువ మెజారిటీలతో బయటపడిన వారు ఈ సారి మాత్రం తప్పించుకోవడం కష్టమని తెలుస్తోంది. ఈ సారి జగన్ గాలి పెద్దగా ప్రభావం చూపదని, పైగా వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకిత పెరుగుతుందని, ఈ కారణాలు టీడీపీకి అనుకూలంగా మారుతాయని విశ్లేషణలు వస్తున్నాయి.

అలా తక్కువ మెజారిటీతో గెలిచి, మంత్రిగా ఛాన్స్ కొట్టిన వారిలో ఒకరైన మంత్రి పేర్ని నానికి ఈ సారి విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో నాని కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతోనే గెలిచి, జగన్ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. అయితే మంత్రిగా ఉన్నా సరే నాని, తన నియోజకవర్గం మచిలీపట్నంలో పెద్దగా మంచి కార్యక్రమాలు ఏమి జరగడం లేదని అంటున్నారు. పైగా గతంలో పార్టీలకు అతీతంగా నడిచే నాని, ఇప్పుడు కక్షపూరితంగా ముందుకెళుతున్నారని, ఆయన మాట తీరులో కూడా మార్పు వచ్చిందని, అటు నియోజకవర్గంలో అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయని, ఇవన్నీ నానికి మైనస్ అవుతున్నాయని అంటున్నారు.

అదే సమయంలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర పుంజుకున్నారని తెలుస్తోంది. అటు ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ళ నానికి ఈ సారి ఇబ్బందికర పరిస్తితులు ఉన్నాయని, ఈయన మంత్రిగా మంచి మార్కులు తెచ్చుకోవడంలో విఫలమయ్యారని, అటు ఎమ్మెల్యేగా కూడా నియోజకవర్గానికి చేసే గొప్ప పనులు ఏమి లేవని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ నేత బడేటి చంటి దూకుడుగా ఉండటం ఆళ్ళకు బాగా మైనస్ అవుతుంది. ఏదేమైనా ఈ ఇద్దరు నానీలకు ఈసారి టీడీపీ చెక్ పెట్టేలా కనిపిస్తోందని అంటున్నారు.
Discussion about this post