జగన్ ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్న విషయం తెలిసిందే. అలాగే టీడీపీ-జనసేన నుంచి వెళ్ళిన వారిని కూడా కలుపుకుంటే 156 మంది వైసీపీ బలం. ఇందులో సీఎం జగన్, 25 మంది మంత్రులని పక్కనబెడితే 125 మంది ఎమ్మెల్యేలు. మరి 125 మంది అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారా? అంటే అబ్బే అసలు లేదని చెప్పొచ్చు. ఈ రెండేళ్లలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదో అధికారంలో ఉండటం, ప్రత్యర్ధులని బెదిరించడం, జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలవగలిగిందని చెబుతున్నారు.
లేదంటే వైసీపీ ఎమ్మెల్యేల పని అప్పుడే అయిపోయేదని అంటున్నారు. ఇప్పుడు వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు ముప్పావు వంతు ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని విశ్లేషణలు వస్తున్నాయి. ప్రజలకు వారు అందుబాటులో ఉండటం గగనమని అంటున్నారు. ప్రజల కోసం పనిచేయడం కంటే వారు సొంత పనులని చక్కదిద్దుకోవడంలో ముందున్నారని చెబుతున్నారు.ఇక ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గానీ, ఎమ్మెల్యే అనుచరులుగానీ చేసే అక్రమాలకు అంతుపోంతు లేదని అంటున్నారు. ఇసుకలో, రోడ్ల కాంట్రాక్ట్‌ల్లో, మట్టిలో, ఇళ్ల స్థలాల్లో అక్రమాలు కోకొల్లలు అని, అలాగే అక్రమ మైనింగ్, భూ కబ్జాల గురించి చెప్పాల్సిన పని లేదని చెబుతున్నారు. ఇలా చాలా అంశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల మీద నెగిటివ్ వచ్చిందని అంటున్నారు.
అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు పుంజుకుంటే టీడీపీకే ప్లస్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు బలపడాల్సిన అవసరముందని, వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్న నెగిటివ్‌ని తమకు అనుకూలంగా మార్చుకుంటే, మంచి ఫలితం వస్తుందని వివరిస్తున్నారు. కాబట్టి టీడీపీ నేతలు ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తే ప్లస్ అవుతుందని అంటున్నారు.
Discussion about this post