గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. అందుకే ప్రధాన పార్టీల నేతలు కూడా కమ్మ వర్గానికే చెందిన వారు ఉన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ కమ్మ నేతలే ప్రత్యర్ధులుగా తలపడ్డారు. అయితే 2009, 2014 ఎన్నికల్లో వినుకొండ ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన జివి ఆంజనేయులు విజయం సాధించారు. 2019 ఎన్నికలోచ్చేసరికి ఆంజనేయులుపై వైసీపీ నుంచి పోటీ చేసిన కమ్మ నేత బొల్లా బ్రహ్మనాయుడు సత్తా చాటారు.
జగన్ వేవ్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన బొల్లా ఎమ్మెల్యేగా మంచి మార్కులు తెచ్చుకోవడం లేదని తెలుస్తోంది. ఈయన ప్రజల మధ్యలో ఉండటం పక్కనబెడితే ఎప్పుడు వివాదాల్లోనే ఉంటున్నారు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఏదొక వివాదంలో ఉంటూనే ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్రమాలు ఎక్కువయ్యాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఇసుక, ఇళ్ల స్థలాల్లో ఎమ్మెల్యే చేసిన అక్రమాలు చాలానే ఉన్నాయని టీడీపీ నేత జివి ఆంజనేయులు ఆరోపిస్తున్నారు. పనికిరాని తన భూములని ప్రభుత్వానికి 18 కోట్లకు అమ్ముకున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర ఆరోపిస్తున్నారు. అలాగే తన భూములకు దగ్గరగా బైపాస్ రోడ్డు నిర్మించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో బైపాస్ రోడ్డుకు భూమి ఇవ్వని రైతు పొలంలో బలవంతంగా శంఖుస్థాపన చేశారు.
అటు శివశక్తి అనే స్వచ్ఛంద సంస్థ పేదలకు ఉచితంగా ఆహారం అందిస్తుంటే, దాన్ని అడ్డుకున్నారు. ఇవన్నీ చూసుకుంటే వినుకొండలో బొల్లాకు పూర్తిగా నెగిటివ్ ఉన్నట్లు కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఈయన గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే మీద తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు మళ్ళీ గెలిచే ఛాన్స్ దక్కడం కష్టమే అంటున్నారు.
Discussion about this post