గత ఎన్నికల్లో చాలా అంటే చాలా దారుణంగా టీడీపీ ఓడిపోయిన విషయం తెలిసిందే. అలా ఓటమి పాలైన పార్టీని చంద్రబాబు ఏదొకరకంగా పైకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. అయితే చంద్రబాబు కష్టపడకుండానే వైసీపీనే, టీడీపీని పైకి తీసుకోస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండేళ్లలో వైసీపీ ఎన్నిరకాలుగా తప్పులు చేసిందో ప్రజలకు బాగా తెలుసు. అలాగే టీడీపీ నేతలు, కార్యకర్తలని ఎప్పటికప్పుడు జైలుకు పంపుతూ, వారిని అణిచివేస్తున్నామని భ్రమపడుతూ, టీడీపీని ఇంకా పైకి లేపుతున్నారు.ఇక ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే…కింద పడిన పైచేయి మాదే అనడం వైసీపీ నేతలకు బాగా అలవాటు అని కొందరు తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. అందుకే వైసీపీనే తప్పు చేసినా, అది తమ తప్పు కాదని వాదించడంలో వైసీపీ నేతలు ముందుంటారు. ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టులోని ఒక గేటు విరిగిపోయి నీరు వృధాగా పోతున్న విషయంలో కూడా వైసీపీ రాజకీయం చేస్తుంది.

2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్, పులిచింతలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు గేటు విరగడంతో వైసీపీ అనుకూల మీడియా సాక్షి ఏం చెబుతుందంటే…2003లోనే బాబు చేసిన తప్పు వల్లే ఇలా జరిగిందని అంటుంది. సాక్షి ఇలా అంటే…ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మరొకలా చెబుతున్నారు. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తే పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోవడానికి కారణమని, చంద్రబాబుతోపాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ బొల్లినేని రామారావు నిర్వాకాలు అని అంటున్నారు. ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని 2015లోనే భద్రతా కమిటీ నివేదిక ఇచ్చినా బాబు ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు.

ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే…పులిచింతల కట్టిన ఘనత వైఎస్సార్‌దే అని వైసీపీ నేతలు చాలా గట్టిగా చెబుతారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ గేటు ఊడిపోతే చంద్రబాబు తప్పు. ఒకవేళ లోపాలు ఉంటే చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు…సరే మరి రెండేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నలు వస్తున్నాయి. అంటే వైసీపీ నేతలు పరిస్తితి ఎలా ఉందంటే…ప్రాజెక్టు కట్టిన ఘనత వైఎస్సార్‌దే..కానీ అందులో లోపాలు చంద్రబాబువి. ఇలా వైసీపీ మరీ అడ్డగోలుగా మాట్లాడుతూ జనంలో చులకన అవుతూ, టీడీపీని బాగా స్ట్రాంగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Discussion about this post