అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఈ జిల్లాలో టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. కానీ గత ఎన్నికల్లోనే జిల్లాల్లో టీడీపీకి షాక్ తగిలింది. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీ కేవలం రెండు స్థానాల్లోనే గెలిచింది. మిగిలిన 12 నియోజకవర్గాల్లో వైసీపీ సత్తా చాటింది. అటు ఎంపీ సీట్లు వైసీపీనే గెలుచుకుంది.
కానీ ఇప్పుడు ఆ పరిస్తితి మారినట్లే కనిపిస్తోంది. రెండేళ్లలో కంచుకోటలో టీడీపీ మళ్ళీ పుంజుకున్నట్లే కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకిత, టీడీపీ నేతలు నిత్యం ప్రజల మధ్యలోనే ఉండటం పార్టీకి బాగా కలిసొస్తుంది. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో టీడీపీ పుంజుకుందని తెలుస్తోంది. మొదట టీడీపీకి సిట్టింగ్ సీట్లుగా ఉన్న హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉంది.ఇక గత ఎన్నికల్లో ఓటమి పాలై ఇప్పుడు పుంజుకున్న నియోజకవర్గాల్లో తాడిపత్రి, కదిరిలు ముందున్నాయనే చెప్పొచ్చు. తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో అంతా చూస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో తాడిపత్రిలో టీడీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ గెలిచే మొదటి సీటు తాడిపత్రి అని చెప్పొచ్చు.
ఇక కదిరిలో టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ, వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకిత వస్తుందని తెలుస్తోంది. ఆ తర్వాత రాయదుర్గంలో కాల్వ శ్రీనివాసులు పికప్ అయ్యారు. ఈయన కూడా పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. అటు పెనుకొండలో పార్థసారథి కూడా దూకుడుగా ఉన్నారు.శింగనమలలో బండారు శ్రావణి, మడకశిరలో ఈరన్న, రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌లు కూడా చాలా వరకు పుంజుకున్నారు. ఇక మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలు కాస్త కష్టపడితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తిరుగుండదనే చెప్పొచ్చు.
Discussion about this post