ప్రజాప్రతినిధులు అంటే నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధుల్లో ఎంతమంది ప్రజల కోసం నిలబడుతున్నారు? అంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ప్రజల కోసం నిలబడే వారు చాలా అరుదై అయిపోయారు. అలాంటి అరుదైన నాయకుల్లో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ముందు వరుసలో ఉంటారు. ఈయనకు నిత్యం ప్రజల మధ్యలోనే ఉండటం అలవాటు. వారికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవడానికి బాగా కష్టపడుతుంటారు. అందుకే పాలకొల్లు ప్రజలు రామానాయుడుకే ఎక్కువ మద్ధతుగా నిలబడుతున్నారు.
ఇక నిమ్మల దెబ్బకు వైసీపీ ఉనికే కష్టమైపోయిందని చెప్పొచ్చు. పాలకొల్లు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నిమ్మల…ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజలతోనే ఉంటున్నారు. అటు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని రాష్ట్ర స్థాయిలో ఎండగడుతున్నారు. చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్ధికం సపోర్ట్ దొరకకపోయినా, తన సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ ముందుకెళుతున్నారు. గత రెండేళ్ల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిమ్మల అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేగా డాబు, దర్పణం నిమ్మల ప్రదర్శించారు. నియోజకవర్గంలో ప్రజలని కలవాలంటే ఒక సైకిల్ వేసుకుని తిరిగేస్తారు. అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే, ఈయనే స్వయంగా రంగంలోకి దిగి పనిచేస్తారు. అలాగే ఏదైనా పని అయ్యేవరకు ఆఫీసుల వద్ద తనదైన శైలిలో దీక్షలకు దిగుతారు. కరోనా సమయంలో పేదలకు పూర్తిగా అండగా నిలబడ్డారు. గత రెండు నెలల నుంచి కొవిడ్ బాధితులను పరామర్శించి, నిత్యావసర సరుకులు, పౌష్టికాహారం అందజేస్తున్నారు. తాజాగా కూడా జోరు వానలో సైకిల్ తొక్కుకుంటూ రామానాయుడు ప్రజల దగ్గరకు వెళ్లారు.ఒక చేత్తో సైకిల్ హ్యాండిల్, మరో చేత్తో గొడుగు పట్టుకుని ప్రజల కోసం పడుతున్న ఈయన కష్టం రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇలా ఓ సామాన్యుడు మాదిరిగా పనిచేస్తారు కాబట్టే, పాలకొల్లు ప్రజలు, రామానాయుడు వైపే ఉన్నారు. అందుకే ఇక్కడ వైసీపీకి ఛాన్స్ లేకుండా పోయింది.
Discussion about this post