అనంతపురం జిల్లా అంటే టిడిపికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఆవిర్భావం నుంచి జిల్లాలో టిడిపి సత్తా చాటుతూనే ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ టిడిపికి మంచి ఫలితాలే వచ్చేవి. కాకపోతే గత ఎన్నికల్లోనే ఇక్కడ టిడిపి బోల్తా కొట్టింది. అయితే ప్రతి ఎన్నికల్లోనూ టిడిపి బోల్తా కొట్టే ఒక నియోజకవర్గం ఉంది. జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలు టిడిపికి కంచుకోటలుగా ఉంటే…ఒక్క అనంతపురం అర్బన్ స్థానం మాత్రం టిడిపికి అసలు కలిసిరాదు. మొదట నుంచి నియోజకవర్గంపై టిడిపికి పెద్ద పట్టు లేదు.

కేవలం టిడిపి ఇక్కడ రెండు సార్లు మాత్రమే గెలిచింది. 1989, 2014 ఎన్నికల్లో మాత్రమే అనంతపురంలో టిడిపి జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో టిడిపి తరుపున ప్రభాకర్ చౌదరీ విజయం సాధించారు. అయిదేళ్ళ పాటు పర్వాలేదనిపించేలా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో చౌదరీ ఓటమి పాలయ్యారు. వైసీపీ తరుపున సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామి రెడ్డి విజయం సాధించారు. అయితే ఎమ్మెల్యేగా అనంతకు మంచి మార్కులే పడుతున్నాయి. రెండేళ్లలో ఈయనపై పెద్దగా వ్యతిరేకత వచ్చినట్లు కనిపించడం లేదు.

పైగా ఈయన చుట్టూ ఎలాంటి వివాదాలు కూడా లేవు. అటు ప్రజలకు కూడా బాగానే అందుబాటులో ఉంటున్నారు. అందుకే అనుకుంటా ఈ నియోజకవర్గంలో టిడిపి అంతగా బలం పుంజుకోవడం లేదు.
ఓ వైపు టిడిపి నేత ప్రభాకర్ చౌదరీ..ప్రజా సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. టిడిపి అధిష్టానం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కానీ ఎన్ని చేసిన నియోజకవర్గంలో కాస్త వైసీపీ ఎమ్మెల్యే హవానే ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అనంతపురంలో టిడిపి దారుణంగా ఓడిపోయింది.

దీని బట్టి చూస్తే అర్బన్ ప్రాంతంలో వైసీపీ స్ట్రాంగ్‌గా ఉందని అర్ధమవుతుంది. పైగా జేసి ఫ్యామిలీతో చౌదరీకి విభేదాలు ఉన్నాయి. దీంతో నియోజకవర్గంలోని క్యాడర్‌ని సమన్వయం చేసుకోవడంలో చౌదరీ విఫలమైనట్లు కనిపిస్తోంది. మొత్తానికి చూసుకుంటే అనంతలో ప్రభాకర్ చౌదరీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల్లోపు ఈ ఇబ్బందులు తొలిగి చౌదరీ పుంజుకుంటారేమో చూడాలి.

Discussion about this post