ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్టీ గాడిలో పడుతుంది. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాక టిడిపి పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ అధినేత చంద్రబాబు పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా పార్టీని మళ్ళీ గాడిలో పెట్టడానికి కష్టపడుతూనే ఉన్నారు. ఇక చంద్రబాబు కష్టానికి లోకేష్ కూడా తొడయ్యారు. ఇద్దరూ కలిసి రెండేళ్లలో పార్టీని చాలా వరకు లైన్‌లో పెట్టారు. ఓ వైపు పార్టీని లైన్‌లో పెట్టడం, మరో వైపు ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లాంటి అంశాలు టిడిపికి బాగా కలిసొచ్చాయి. అలాగే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం కూడా టిడిపికి బాగా ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే టిడిపి ఇంకా పికప్ అవ్వాలసిన అవసరముంది. ఎందుకంటే కొన్నిచోట్ల వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా సరే, ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టిడిపి ఇంచార్జ్‌లు ఉన్నారు. అలాగే ఎన్నికలై రెండేళ్ళు దాటేసిన కూడా కొందరు ఇంచార్జ్‌లు యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఫలితంగా కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి వీక్‌గా కనిపిస్తోంది. ఈ పరిస్తితిని మార్చాలని టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నెల లోగా అన్నీ నియోజకవర్గాలకు బలమైన ఇంచార్జ్‌లని పెట్టాలని అనుకుంటున్నారు.

అలాగే యాక్టివ్‌గా లేని ఇంచార్జ్‌లు దూకుడు పెంచాలని, లేదంటే వారిని పక్కకు తప్పించి వేరే వారికి ఛాన్స్ ఇస్తానని డైరక్ట్‌గా టిడిపి నేతలకు వార్నింగ్ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా వైసీపీపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి పికప్ అవ్వకపోవడంపై కూడా చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారని సమాచారం. త్వరగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పుంజుకోపోతే అక్కడ ఇంచార్జ్‌లని కూడా సైడ్ చేస్తానని బాబు, టిడిపి నేతలకు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. మొత్తానికి పార్టీని లైన్‌లో పెట్టడానికి బాబు డైరక్ట్ రంగంలోకి దిగి అంతా సెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Discussion about this post