గత ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతల వారసులు పోటీలో దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీకి చెందిన పలువురు సీనియర్లు పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులని రంగంలోకి దింపారు. అయితే జగన్ వేవ్‌లో ఆ వారసులు ఓటమి పాలయ్యారు. ఇక అలా ఓటమి పాలైన వారసులు ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు.
అలా గెలుపు కోసం కష్టపడుతున్న వారిలో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన దివంగత కాగిత వెంకట్రావు తనయుడు కూడా ఉన్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాగిత కృష్ణా జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. టీటీడీపీ ఛైర్మన్‌గా, ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. ఇలా టీడీపీలో కీలక స్థానంలో ఉన్న కాగిత గత ఎన్నికల్లో అనారోగ్య కారణాలతో పోటీకి దూరంగా ఉండి, తన తనయుడుని బరిలో పెట్టారు.
అయితే జగన్ వేవ్‌లో కాగిత వారసుడు కృష్ణప్రసాద్ 6 వేల ఓట్ల మెజారిటీతో జోగి రమేష్ చేతిలో ఓడిపోయారు. ఇక ఓడిపోయాక కృష్ణప్రసాద్ సైలెంట్ అయ్యారు. కానీ అనారోగ్యంతో కాగిత వెంకట్రావు మరణించారు. ఈ క్రమంలోనే కృష్ణప్రసాద్ ఇంకా యాక్టివ్ అయ్యారు. తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ, నియోజకవర్గంలో ఉండే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
అటు ఎమ్మెల్యేగా జోగి రమేష్ పనితీరు ఏమి గొప్పగా లేదని తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలు తప్ప కొత్తగా పెడన ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమి లేదు. పైగా జోగి స్థానికంగా అందుబాటులో ఉండరు. ఈ క్రమంలోనే కృష్ణప్రసాద్ ప్రజలకు అండగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాలని గమనిస్తే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ కాగిత వారసుడు మొదటి విజయం అందుకునేలా కనిపిస్తున్నారు.
Discussion about this post