రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ.. పది జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడా కూడా పుం జుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదు. కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో పరిస్థితిని గమనిస్తే. మొత్తం 10 జిల్లా ల్లో వైసీపీ పరిస్థితి జీరో.. అనే మాట వినిపిస్తోంది. ఎక్కడికక్కడ పార్టీ ఆధిపత్య ధోరణి.. కులాల మధ్య కుమ్ములాటలు.. పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంటే.. మరోవైపు.. అభివృద్ధి లేకపోవడం.. ప్రజల్లో పార్టీని మరింత పలుచన అయ్యేలా చేస్తోంది.

దీంతో వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసీపీ వేసుకుంటున్న అంచనాలు తారుమారు కావడం తథ్యమనే మాట వినిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ పుంజుకునే పరిస్థితి లేదు. పైకి మాత్రం చాలా మంది నాయకులు ఇక్కడ కనిపిస్తున్నారు. పైగా ఎస్సీ సామాజిక వర్గానికి రక్షణ లేదనే వాదన బలంగా ఈ రెండు జిల్లాల్లోనూ వినిపిస్తోంది. అదేసమయంలో ఇక్కడ కూడా అభివృద్ధి కనిపించడం లేదు. ఇక్కడ రైతులు.. పోలవరం నీటిపై ఆశలు పెట్టుకున్నారు.

కానీ, పోలవరం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక,ఉమ్మడి కృష్ణాలోనూ.. ఒకటి రెండు నియోజక వర్గాలు తప్ప.. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. మరీముఖ్యంగా సీమలో కర్నూ లు, అనంతపురం జిల్లాల్లో.. ఉన్న కొత్త జిల్లాలలోనూ.. వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. నేతల మధ్య సఖ్యత లేదు. మరోవైపు.. జనసేన పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక, సంస్థాగతంగా.. పార్టీలోనూ అంతర్గత కుమ్ములాటలు వస్తున్నాయి.

దీంతో పది జిల్లాల్లో వైసీపీకి ఎదురు గాలివీస్తోంది. ఇక, జంపింగులకు ప్రాధాన్యం లేక పోవడంతో వారు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉన్న నాయకులు పనిచేయడం లేదు. కార్యకర్తలను ప ట్టించుకునేవారు కూడా కనిపించడం లేదు. దీంతో అసలు నియోజకవర్గాల్లో జోష్ కూడాకనిపించడం లేదు. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితిని చక్కదిద్దుకునే పరిస్థితి చేపట్టకపోతే.. పార్టీకి ఈ పది జిల్లాల్లోనూ.. ఎదురు దెబ్బలు తప్పవని.. సంకేతాలు వస్తున్నాయి. నాయకులు కూడా.. ప్రభుత్వంపై వ్యతిరేకతను తట్టుకోలేక.. గెలిస్తే.. గెలుస్తాం..లేకపోతే.. ప్రతిపక్షంలో ఉంటాం..అని డిసైడ్ అయిపోయారంటే.. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్ధమవుతుంది.

Discussion about this post