అధికారం కోల్పోయిన దగ్గర నుంచి టిడిపి అధినేత చంద్రబాబు ఏ విధంగా పార్టీని పైకి లేపడానికి కృషి చేస్తున్నారో తెలిసిందే. మళ్ళీ పార్టీని గాడిలో పెట్టి, నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఇక చంద్రబాబుకు తోడుగా నారా లోకేష్ కూడా పార్టీలో దూకుడుగా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వైసీపీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్న కూడా గట్టిగానే నిలబడుతున్నారు. కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటున్నారు.

అయితే చంద్రబాబు, లోకేష్‌లకు తోడుగా టిడిపి నేతలు కూడా దూకుడుగా పనిచేస్తున్నారు. మొదట్లో కేసులకు భయపడినా లోకేష్ సైతం అరెస్ట్ అయ్యాక టిడిపి నేతలు ధైర్యం తెచ్చుకుని మరీ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నిజంగా పార్టీ కోసం పనిచేసే నాయకులని పక్కనపెడితే కొందరు ఫోటోల కోసమే పనిచేస్తున్నారని అర్ధమవుతుంది. అలాంటి వారి వల్ల పార్టీకే నష్టం జరుగుతుందని టిడిపి శ్రేణులు మాట్లాడుతున్నాయి.ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే…ఆ కార్యక్రమాలని కొందరు నాయకులు తూతూ మంత్రంగా నడిపించేస్తున్నారు. ఏదో కొన్ని ఫోటోలు తీయించుకుని, కార్యకర్తలతో సెల్ఫీలు దిగేసి సోషల్ మీడియాలో పెట్టేసి ఏదో పార్టీ కోసం చేసేసినట్లు హడావిడి చేస్తున్నారు. అలాగే టిడిపి అధిష్టానం పిలుపునిచ్చే కొన్ని కార్యక్రమాలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వడం లేదు.

ఒకవేళ ఇచ్చినా ఎక్కడకక్కడ అడ్డుకునే పరిస్తితి ఉంటుంది. ఇటీవల నారా లోకేష్ నరసారావుపేట పర్యటన ఏమైందో అందరికీ తెలిసిందే. లోకేష్‌ని నరసారావుపేట వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే ఈలోపే కొందరు టిడిపి నాయకులని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ నాయకులే కావాలని హౌస్ అరెస్ట్ చేయించుకుని, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

అంటే కొందరు నాయకులు కేవలం ఫోటోల్లోనే పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక అలాంటి నాయకులకు చెక్ పెట్టాల్సిన బాధ్యత చంద్రబాబుదే అని కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఎన్నికల వరకు వాళ్ళు అలాగే చేస్తే పార్టీకే బొక్క అంటున్నారు.

Discussion about this post