ఏపీ రాజకీయాల్లో వైసీపీకి అనుకూలంగా కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆ మీడియా సంస్థలు జగన్ ఏం చేసిన భజన చేయడం చేసేవి. అలాగే చంద్రబాబుపై విమర్శలు చేసేవి. అలా వైసీపీకి అనుకూలంగా ఉండే ఓ బ్లూ మీడియా జర్నలిస్ట్ ఈ మధ్య జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొన్నటివరకు ఆ జర్నలిస్ట్ ప్రతి విషయంలోనూ చంద్రబాబుపై విమర్శలు చేసేవారు. ఒక యూట్యూబ్ చానల్‌కు పెట్టుకుని నిత్యం జగన్‌కు భజన చేస్తూ, బాబుపై విమర్శలు చేసేవారు. మరీ గుడ్డెద్దు చేలో పడ్డట్టు బాబుపై మాటల దాడి చేసేవారు. కాని అలాంటి జర్నలిస్ట్ ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల జాబ్ క్యాలెండర్ పేరిట జగన్ ప్రభుత్వం నిరుద్యోగులని మోసం చేసిన విషయం తెలిసిందే. కేవలం 10 వేల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్‌లో పెట్టి చేతులు దులుపుకున్నారు. గతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేయడంపై నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. జాబ్ క్యాంలెండర్ రద్దు చేసి కొత్తది ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి నిరుద్యోగుల నుంచి నిరసన రావడం వలనో లేక బ్లూ మీడియా జర్నలిస్ట్‌లో మార్పు వచ్చిందో తెలియదుగానీ, ఆ జర్నలిస్ట్ మాత్రం ఈ విషయంపై వైసీపీ ప్రభుత్వంపై గట్టిగానే విరుచుకుపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులని మోసం చేశారని మాట్లాడారు.
పెద్ద ఎత్తున పోలీసు, డిఎస్‌సి, గ్రూప్ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి జగన్ మాట తప్పారని అంటున్నారు. అలాగే హిందూ దేవుళ్ళని కించపరుస్తూ మాట్లాడే కత్తి మహేష్‌కు జగన్ ప్రభుత్వం 17 లక్షలు సాయం చేయడంపై కూడా ఆ జర్నలిస్ట్ గళం విప్పారు. ఆస్తులు బాగానే ఉన్న వ్యక్తికి ఆర్ధిక సాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కావాలంటే పార్టీ నుంచి సాయం చేయాల్సిందని, ప్రభుత్వ సొమ్ముని అలా ఎలా ఇస్తారని అంటున్నారు. మొత్తానికైతే ఆ బ్లూ మీడియా జర్నలిస్ట్‌లో మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది.
Discussion about this post