April 2, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

ఆ మూడు సీట్లలో టీడీపీకి నో ఛాన్స్..చేంజ్ వస్తుందా?

ఉమ్మడి గుంటూరు జిల్లాపై తెలుగుదేశం పార్టీకి పట్టు పెరిగిన విషయం తెలిసిందే.  గత ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి చిత్తూరుగా ఓడింది. రాజధాని అమరావతి తీసుకొచ్చిన సరే ఇక్కడి ప్రజలు టి‌డి‌పిని ఓడించారు. జిల్లాలో 17 సీట్లు ఉంటే వైసీపీ 15, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పి నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో టి‌డి‌పికి ఒక ఎమ్మెల్యే మిగిలారు.

ఇలా గుంటూరులో టి‌డి‌పి పరిస్తితి దారుణంగా అయింది..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలో సైతం టి‌డి‌పి ఓడిపోయింది..వైసీపీ గెలిచింది. అధికార బలంతో వైసీపీ గెలుస్తూ వచ్చింది. కానీ నిదానంగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగింది..రాజధాని అమరావతిని మార్చడంపై జనం ఆగ్రహంతో ఉన్నారు. కానీ వారు సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటు టి‌డి‌పి నేతలు పికప్ అవుతూ వస్తున్నారు. దీంతో జిల్లాలో టి‌డి‌పి ఆధిక్యం పెరిగింది. ఇటీవల సర్వేలో కూడా టి‌డి‌పి హవా స్పష్టంగా కనిపించింది.

జిల్లాలో పొన్నూరు, వినుకొండ, తాడికొండ, మంగళగిరి, చిలకలూరిపేట, బాపట్ల, వేమూరు, రేపల్లె సీట్లలో టి‌డి‌పి గెలుపు ఖాయమైంది. అటు గురజాల, గుంటూరు వెస్ట్, సత్తెనపల్లిలో కాస్త కష్టపడితే టి‌డి‌పి గెలవడం ఖాయం. ఇక ప్రత్తిపాడు, తెనాలి, పెదకూరపాడు సీట్లు వైసీపీ గెలుస్తుందని తేలింది. అయితే జనసేనతో పొత్తు ఉంటే ఈ సీట్లలో గెలుపు సులువే.

కానీ మరో మూడుసీట్లు గుంటూరు ఈస్ట్, మాచర్ల, నరసారావుపేట స్థానాల్లో వైసీపీ గెలుపుని ఆపడం కష్టమని తెలుస్తోంది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి గెలుపు దక్కలేదు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది. ఈ సారి కూడా వైసీపీ గెలవడం ఖాయమని తెలుస్తోంది. ఈ మూడు స్థానాల్లో టి‌డి‌పి గెలిచే ఛాన్స్ కనిపించడం లేదు.