అమరావతిని రాజధానిగా కాదని జగన్ ప్రభుత్వాని మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని శాసనరాజధానిగా పరిమితం చేసి, విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేయడానికి జగన్ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించుకుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రజలు గత 600 రోజులుగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. కానీ వారి డిమాండ్‌ని వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

పైగా వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఉద్యమం చేస్తున్న అమరావతి ప్రజలపై విమర్శలు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. మొత్తం పెయిడ్ ఆర్టిస్టులు అంటూ, అమరావతి ఉద్యమం బినామీ ఉద్యమం అని నానా రకాలుగా విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలన్నీ వైసీపీ నేతలకు రివర్స్ అయ్యే సమయం వస్తుందని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. కానీ అమరావతికి దగ్గర ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజల నుంచి మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం విప్పడం అయితే జరగడం లేదు.

కేవలం ఆ 29 గ్రామాల ప్రజలు మాత్రమే ఉద్యమం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా స్థానిక ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ భారీ స్థాయిలో గెలిచింది. దీంతో మూడు రాజధానులకు మద్ధతు వచ్చేసినట్లే అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉండటం, పథకాలు పోతాయనే భయం, రాజధాని కోసం రోడ్డు ఎక్కితే కేసులు పెడతారనే భయంతో ఈ జిల్లాల ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

కానీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేసరికి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీకి ఇబ్బందులు తప్పవని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అమరావతి ప్రభావం సైలెంట్‌గా వైసీపీని ఓడించనుందని, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ భారీగా సీట్లు కోల్పోవడం గ్యారెంటీ అని అంటున్నారు.

Discussion about this post