పైకి మాత్రం ప్రతి పని గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడం జగన్ ప్రభుత్వానికి అలవాటైన పనే. కానీ అందులో ఎన్ని బొక్కలు ఉంటాయో మాత్రం చెప్పరు. వాటి వల్ల జనాలు ఎంతలా ఇబ్బంది పడుతున్నారో జగన్ ప్రభుత్వానికి కనబడవు. వాటి నుంచి తమకు ఆదాయం వస్తుందా? లేదా? అనేది మాత్రమే జగన్ ప్రభుత్వం చూసుకుంటుంది. మద్యపాన నిషేధం అంటూ జగన్ ప్రభుత్వం ఏ రకంగా డప్పు కొట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇక జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీ వల్ల జనాలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మద్యపాన నిషేదం అని చెప్పి, మద్యం రేట్లని విపరీతంగా పెంచేశారు. పైగా నాసిరకం మద్యాన్ని అమ్ముతూ, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అటు మద్యం షాపుల పేరుతో వైసీపీ నేతలు ప్రభుత్వం దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు దోచుకుంటున్నారు. పైగా మద్యాన్ని ఆదాయంగా చూపించి అప్పులు కూడా చేస్తారు. ఒక్క మద్యం విషయంలో ప్రభుత్వం, జనంపై పెద్ద ఎత్తున భారం వేస్తుంది.

ఇక జనాలని ముంచుతున్న మరో అంశం ఇసుక. అబ్బో గత టీడీపీ ప్రభుత్వం ఇసుకలో అక్రమాలు చేసిందని, తాము శుద్ధంగా ఇసుక అమ్ముతామని మూడు, నాలుగు సార్లు ఇసుక పాలసీలు తీసుకొచ్చారు. దీని వల్ల ప్రజలకు పావలా ఉపయోగం లేదు. పైగా గతంలో కంటే ఇసుక ధరలు భారీగా పెరిగాయి. ప్రైవేట్ సంస్థకు ఇసుకని అప్పగించి మరీ వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా అక్రమాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇక ప్రతి నియోజకవర్గంలో ఇసుకలో వైసీపీ నేతలు చేసే అక్రమాలు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇసుక వల్ల ఇళ్ళు కట్టుకునే ప్రతి పేదవాడు ఇబ్బంది పడుతున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఇలా ఇసుక, మద్యం పాలసీలతో జగన్, జనాలని బాగా ముంచేశారు.

Discussion about this post