అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టిడిపికి తిరుగులేని బలం ఉంది. అయితే టిడిపికి మొదట నుంచి బలం లేని నియోజకవర్గం ఒకటి ఉంది. అదే మడకశిర నియోజకవర్గం ఇక్కడ టిడిపి ఎక్కువసార్లు గెలిచిన దాఖలాలు లేవు. పార్టీ ఆవిర్భవించాక కేవలం మూడుసార్లు గెలిచింది.

అయితే 2014లో గెలిచిన ఈరన్న తప్పుడు అఫడవిట్ ఇచ్చారని ఆరోపణలు రావడంతో కోర్టు ఆయన్ని 2018లో ఎమ్మెల్యే పదవికి అనర్హుడుని చేసింది. దీంతో వైసీపీ నేత తిప్పేస్వామి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా ఈయనే వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈరన్న టిడిపి తరుపున పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక ఈరన్న సైలెంట్ అవ్వకుండా, మళ్ళీ మడకశిరలో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అటు టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సైతం మడకశిరలో వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామికి చెక్ పెట్టాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈరన్న, తిప్పేస్వామిలు కలిసి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టడానికి చూస్తున్నారు. ప్రజా సమస్యలపై బాగానే పోరాటం చేస్తున్నారు. ఇక రెండేళ్లలో మడకశిరలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం. ఏదో సంక్షేమ పథకాలు మినహా ఇక్కడ ప్రజలకు కొత్తగా ఒరిగిందేమీ లేదు. అటు ఎమ్మెల్యేగా తిప్పేస్వామికి కూడా మంచి మార్కులు పడటం లేదు.

ఇటీవల వస్తున్న సర్వేల్లో కూడా తిప్పేస్వామికి బాగా నెగిటివ్ ఉన్నదని అర్ధమవుతుంది. వైసీపీ తరుపున ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్‌లో తిప్పేస్వామి కూడా ఉన్నారు. దీంతో మడకశిరలో టిడిపికి లైన్ క్లియర్ అయినట్లైంది. అయితే మరో రెండేళ్ళు కష్టపడితే తిప్పేస్వామికి చెక్ పెట్టొచ్చని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. ఈ సారి ఎలాగైనా తిప్పేస్వామికి గెలిచే ఛాన్స్ ఇవ్వమని చెబుతున్నారు. మరి చూడాలి మడకశిరలో ఈ సారి పసుపు జెండా ఎగురుతుందేమో.

Discussion about this post