గుంటూరు జిల్లా…మాచర్ల నియోజకవర్గం….వైసీపీకి కంచుకోట…ఇక్కడ టిడిపికి అసలు గెలిచే అవకాశాలు చాలా తక్కువ. మొదట నుంచి ఈ నియోజకవర్గంలో టిడిపికి ఎక్కువ విజయాలు రాలేదు. 1983, 1989, 1994, 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టిడిపి గెలిచింది. ఇక ఆ తర్వాత నుంచి మాచర్లలో టిడిపి జెండా కనిపించలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూనే వస్తుంది. అయితే భవిష్యత్‌లో ఇక్కడ టిడిపికి గెలిచే అవకాశాలు పెద్దగా లేవని తెలుస్తోంది.

ఎందుకంటే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పిన్నెలి…ఆ తర్వాత వైసీపీలోకి వచ్చేసి…2012 ఉపఎన్నికలో గెలిచారు. అలాగే 2014, 2019 ఎన్నికల్లో కూడా సత్తా చాటారు. అయితే స్వతహాగా పిన్నెల్లికి ఇక్కడ ఫుల్ ఫాలోయింగ్ ఉంది. మాచర్ల ప్రజలకు ఎప్పుడు పిన్నెల్లి అండగా ఉంటారు. అందుకే ఇంకో పార్టీని ఇక్కడ ప్రజలు పెద్దగా ఆదరించే పరిస్తితి లేదనే చెప్పొచ్చు.

ఇక స్థానిక ఎన్నికల్లో కూడా మాచర్లలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. ఇక్కడ పిల్లోడు దగ్గర నుంచి పండు ముసలోడు వరకు పిన్నెల్లిని అభిమానిస్తారు. అందుకే ఆయనని ఓడించడం అంత సులువు కాదని చెప్పొచ్చు. ఇక్కడ వరుసగా టిడిపి అభ్యర్ధులని మారుస్తూ వస్తున్న పెద్ద ఫలితం కూడా ఉండటం లేదు. 2014 ఎన్నికల్లో ఇక్కడ కొమ్మారెడ్డి చలమారెడ్డి పోటీ చేసి ఓడిపోగా, 2019 ఎన్నికల్లో అంజిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు.

మళ్ళీ ఇప్పుడు చలమారెడ్డి ఇంచార్జ్‌గా ఉంటున్నారు. ఇంచార్జ్‌గా తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు గానీ, కొంచెం కూడా పిన్నెల్లికి పోటీ ఇచ్చే స్థాయికి టిడిపిని బలోపేతం చేయలేదు. మొత్తానికైతే పిన్నెల్లిని ఓడించడం టిడిపికి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.

Discussion about this post