శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ బలం గురించి, ఆ జిల్లా ప్రజలకు బాగా తెలుసు. అలాగే జిల్లా ప్రజలకే కాదు ఆ ఫ్యామిలీ బలం ఏంటో, దువ్వాడ శ్రీనివాస్‌కు కూడా బాగా తెలుసు. మొదట నుంచి కింజరాపు ఫ్యామిలీ అంటే దువ్వాడ ఫ్యామిలీకి పడదనే చెప్పొచ్చు. జిల్లాలో దువ్వాడ ఫ్యామిలీపై కింజరాపు ఫ్యామిలీదే పైచేయి. అందుకే దువ్వాడ శ్రీనివాస్, కింజరాపు ఫ్యామిలీకి ఎలాగైనా చెక్ పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

అనేక పార్టీలు మారినా సరే దువ్వాడకు కింజరాపు ఫ్యామిలీకి చెక్ పెట్టలేకపోతున్నారు. దువ్వాడ అటు బాబాయి మీద, ఇటు అబ్బాయి మీద కూడా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో దువ్వాడ వైసీపీ తరుపున టెక్కలి నుంచి బరిలో దిగి అచ్చెన్నాయుడుపై ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసి రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ టెక్కలి బరిలో దిగడానికి దువ్వాడ సిద్ధమయ్యారు. అందుకే అక్కడ అచ్చెన్నకు ఎలా చెక్ పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

పైగా అధికారంలో ఉండటంతో, తన అధికార బలాన్ని మొత్తం ఉపయోగించి అచ్చెన్నకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు. అయితే టెక్కలిలో అచ్చెన్న బలం ఏ మాత్రం తగ్గకపోవడంతో దువ్వాడకు ఫ్రష్టేషన్ పెరిగిపోతుందని తెలుగు తమ్ముళ్ళు కామెంట్ చేస్తున్నారు. అందుకే దువ్వాడ బూతులు కూడా మాట్లాడుతున్నారని, చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నలపై ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకున్నారని, ఇలా చేస్తేనే ప్రజలు తనని గుర్తు ఇస్తారని దువ్వాడ ఓ భ్రమలో ఉన్నారని అంటున్నారు.

ఇలా బూతులు మాట్లాడటం వల్ల దువ్వాడకు ఉన్న ఇమేజ్ కూడా పోతుందని, దాని వల్ల అచ్చెన్నకు చెక్ పెట్టడం పక్కన ఉంచితే, దువ్వాడ తనకు తాను చెక్ పెట్టుకునేలా ఉన్నారని తమ్ముళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. ఏదేమైనా కింజరాపు ఫ్యామిలీ దువ్వాడలో ఫ్రష్టేషన్ పెంచేసిందని చెబుతున్నారు.

Discussion about this post