పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం…ఇక్కడ ఏ పార్టీ అయితే గెలుస్తుందో, అదే పార్టీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తుంది. గత నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఇదే ట్రెండ్ ఏలూరులో కొనసాగుతుంది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించగా, రాష్ట్రంలో కూడా టీడీపీనే అధికారంలోకి వచ్చింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. రాష్ట్రంలో కూడా ఆయా పార్టీలే అధికారంలోకి వచ్చాయి.
అయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ సీన్ మారేలా కనిపిస్తోంది. ఈ సారి అక్కడ టీడీపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆళ్ళ నాని ఉన్నారు. నాని, జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కూడా ఉన్నారు. కాకపోతే ఆళ్ళ నాని మంత్రిగా మెరుగైన పనితీరు కనబర్చడంలో బాగా వెనుకబడినట్లు కనిపిస్తోంది. పైగా కోవిడ్ సమయంలో అసలు రాష్ట్రానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఎవరని చర్చ కూడా నడిచింది. అంటే ఆళ్ళనే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అని రాష్ట్రంలో ప్రజలకు తెలియదంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.మంత్రిగానే కాదు ఆళ్ళ ఎమ్మెల్యేగా కూడా ఏలూరు నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏమి లేదని తెలుస్తోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు అభివృద్ధి శూన్యం. ఏదో ప్రభుత్వ పథకాలు మాత్రం వస్తున్నాయి. పైగా ఇటీవల కలుషిత నీరు వల్ల ఏలూరు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. ఇలా ఆళ్ళకు కాస్త నెగిటివ్‌గా ఉండటం ఏలూరు టీడీపీ ఇన్‌చార్జ్ బడేటి చంటికి బాగా ప్లస్ అవుతుంది. పైగా చంటి కూడా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
దీని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో చంటికి మంచి ఛాన్స్ దక్కేలా కనిపిస్తోంది. అయితే తాజాగా ఏలూరు కార్పొరేషన్‌లో వైసీపీ విజయం సాధించింది. కానీ ఆ విజయం అధికార బలంతో వచ్చిందని అర్ధమవుతుంది. ఎందుకంటే ఇక్కడ వైసీపీ పోటీ లేకుండా గెలిచింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిందని పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.ఇక ఏలూరు కార్పొరేషన్‌లో విజయం కూడా గాలి వాటమే అంటున్నారు. కానీ నియోజకవర్గ స్థాయికొచ్చేసరికి పరిస్తితి మారుతుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఆళ్ళ కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతోనే గెలిచారు. అలాగే ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆళ్ళ మంచి పనితీరుకనబర్చడం లేదు. కాబట్టి నెక్స్ట్ మాత్రం ఏలూరులో ఆళ్ళకు చెక్ పడేలా కనిపిస్తోంది.
Discussion about this post