రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిన్న మొన్నటి వరకు పరిస్థితి ఎలా.. రేపటి పరిస్థితి ఎలా మారుతుందనేది రాజకీయాల్లో మరింతగా ఊహించలేని పరిణామం. దీనికి కారణం.. నేతల దూకుడు, అధిష్టానం వద్ద.. ఫాలోయింగ్ ఇలా.. అనేక విషయాలు ప్రభావం చూపుతుంటాయి. ఇలాంటి వాటిని తట్టుకుని నిలబడితేనే.. రాజకీయాల్లో దూకుడుగా ముందుకు సాగడం అనేది సాధ్యమవుతుంది అయితే.. ఈ విషయంలో సీనియర్ నాయకుడు, ఒకప్పుడు రాష్ట్రాన్ని సైతం తన చేతల్లో పెట్టుకుని.. వ్యవహరించిన నేత, ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడో వెనక్కి అడుగులు వేస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ.. ఉన్న నేతల్లో చాలా సీనియర్. గతంలో వైఎస్ కేబినెట్లోనూ మంత్రిగా చక్రం తిప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్‌గానే ఆయన వ్యవహరించారు. ఈ క్రమంలోనే వైసీపీలోకి వచ్చి.. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టారు. అయితే.. కొన్నాళ్లుగా ఆయన యాక్టివ్‌గా ఉండలేక పోతున్నారని.. దూకుడు లేకుండా వ్యవహరిస్తున్నారని.. ఆయన అనుచరులే కాకుండా.. సొంత జిల్లా విజయనగరంలోనూ చర్చించుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం.. పార్టీలో కీలక నాయకుడుగా ఉన్న ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జ్.. సాయిరెడ్డేనని అంటున్నారు.
విజయసాయి దూకుడుతో ఏకంగా.. బొత్స.. రాజకీయాలకే గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు విజయనగరంలో టాక్ నడుస్తో్ంది. అయితే.. ప్రత్యక్ష రాజకీయాలకే బొత్స గుడ్ బై చెప్పనున్నారని.. నామినేటెడ్ పదవి కోసం.. ఎదరు చూస్తున్నారని.. అంటున్నారు.. ప్రస్తుతం ఈ విషయం.. పార్టీ సీనియర్ నేతల మధ్య అత్యంత రహస్యంగా చర్చకు దారితీయడం గమనార్హం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఆయన తన సతీమణి, కుమారుడికి కూడా టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగంగానే ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవడం ద్వారా.. పార్టీలో తనపై వ్యతిరేకత తగ్గడంతోపాటు.. తనకు కూడా ఆరోగ్యం పరంగా బాగుంటుందని బొత్స ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Discussion about this post