సినిమా తారలు అన్నాక మద్యం తీసుకోవడం, డ్రగ్స్ తీసుకోవడం కామన్ అయిపోయింది. గత మూడేళ్లుగా చూస్తే తెలుగు సినిమా రంగంలోనూ… అటు కన్నడ సినిమా రంగంలోనూ ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు ద్వితీయ శ్రేణి ఆర్టిస్టులు డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుని చివరకు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. కన్నడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్ల పేర్లు సైతం బయటకు వచ్చాయి. అటు బాలీవుడ్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలువురు టాప్ హీరోలు, హీరోయిన్లకు ఉన్నట్టు ఆరోపణలు రావడం.. ఈడీ విచారణ చేయటం జరిగింది. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ సినిమా ఇండస్ట్రీలోనూ డ్రగ్స్ రాకెట్ కలకలం రేపింది. అక్కడ స్టార్ హీరోయిన్గా ఉన్న పోరి మోనిని రాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్.ఏ.బీ) అదుపులోకి తీసుకుంది.

జూన్ 8న బోట్ క్లబ్ లో తనపై అత్యాచారం చేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని పోరి మోనీ ఆరోపించింది. దీనిపై ఆరాతీసిన పోలీసులు బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ రాకెట్ పై కన్నేశారు. పోలీసుల విచారణలో పలు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆమెకు డ్రగ్ రాకెట్‌లో లింకులు ఉన్నాయని.. వాళ్లలో వాళ్లకు గొడవలు రావడంతోనే కొందరు దండుగులు ఆమెను చంపే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు.

అనంతరం పోలీసులు ఆమె ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించి.. ఈ తనిఖీల్లో ఆమె ఇంటి నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. హీరోయిన్ పోరీ మోనీ బంగ్లాదేశ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. ఆమె గతంలోనే ప్రముఖ రాజకీయ నాయుడు అయిన ఉద్దీన్ మహమూద్ తనపై దాడి చేసినట్టు సంచలన ఆరోపణలు చేసింది. అతడు తనపై లైంగీక వేధింపులకు కూడా పాల్పడ్డారని కూడా బాంబు పేల్చింది. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆమె అరెస్టు కావడం సంచలనంగా మారింది.
Discussion about this post