ధూళిపాళ్ళ నరేంద్ర….దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుడు. అనేకసార్లు తిరుగులేని విజయాలు అందుకున్న నరేంద్ర, గత ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అలా ఓటమి పాలైన నరేంద్రని వైసీపీ ప్రభుత్వం ఎలా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. ధూళిపాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్న సంఘం డైరీని నానా ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదిపింది. అమూల్ డైరీకి మేలు చేయడమే లక్ష్యంగా, సంఘం డైరీ మీద ఆధారపడిన రైతులని ఇబ్బంది పెట్టడానికి చూశారు.
ఈ క్రమంలోనే సంఘం డైరీలో అక్రమాలు జరిగాయని చెప్పి, ఎలాంటి ఆధారాలు లేకుండా ధూళిపాళ్ళ నరేంద్రని ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేయించిందని టీడీపీ శ్రేణులు మొదట నుంచి మండిపడుతూనే ఉన్నాయి. అన్యాయంగా ధూళిపాళ్ళని అరెస్ట్ చేయించారని టీడీపీ శ్రేణులు, అధినేత చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద ఎత్తున పోరాటం కూడా చేశారు. నరేంద్ర బెయిల్ మీద బయటకొచ్చాక లోకేష్, ఆయన్ని పరామర్శించారు.ఇక తాజాగా చంద్రబాబు కూడా నరేంద్ర ఇంటికెళ్ళి పరామర్శించి, వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అయితే ధూళిపాళ్ళనే కావాలనే అరెస్ట్ చేశారనే వాదన సామాన్య ప్రజల్లో కూడా ఉంది. ముఖ్యంగా పొన్నూరు ప్రజలు ధూళిపాళ్ళ పట్ల సానుభూతితో ఉన్నారని తెలుస్తోంది. నెక్స్ట్ ఇక్కడ ధూళిపాళ్ళకు పెద్ద ఎత్తున మద్ధతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మామూలుగానే పొన్నూరు ధూళిపాళ్ళ ఫ్యామిలీకి కంచుకోట.
టీడీపీ ఆవిర్భావం నుంచి అంటే 1983 నుంచి 2014 వరకు ఇక్కడ ధూళిపాళ్ళ ఫ్యామిలీ సత్తా చాటింది. వరుసగా మూడుసార్లు ధూళిపాళ్ళ వీరయ్య గెలవగా, నరేంద్ర వరుసగా అయిదుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లోనే ధూళిపాళ్ళ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. అయితే ఈసారి ధూళిపాళ్ళతో వైసీపీకి కష్టమే అంటున్నారు. ఇక ధూళిపాళ్ళని ఓడించడం కష్టమని టీడీపీ శ్రేణులు గట్టిగా చెబుతున్నాయి.
Discussion about this post