పవన్ కల్యాణ్…ఈ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అటు సినిమాలైన, ఇటు రాజకీయాలైన పవన్ కనిపిస్తే చాలు అభిమానులు హడావిడి చేసేస్తారు. ఇంత క్రేజ్ ఉన్న పవన్ సినిమాల్లో సక్సెస్ అయినా, రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. అలా అని రాజకీయాల్లో పవన్‌కు క్రేజ్ లేదని కాదు. అసలు ఆయన బయటకు వస్తే చాలు వేలమంది జనం వస్తారు.

కానీ పవన్‌ని చూడటానికి వచ్చిన జనం మాత్రం జనసేనకు ఓట్లు వేయరు. ఇప్పుడు ఇదే జనసేన పార్టీకి అతి పెద్ద సమస్య. ప్రశ్నిస్తానని చెప్పి పవన్ జనసేన పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. 2014లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీలకు సపోర్ట్ చేశారు. ఇక ఆ తర్వాత రెండు పార్టీలకు మద్ధతు ఇవ్వడం లేదని చెప్పి, వారిపైనే తీవ్ర విమర్శలు చేశారు. ఇక 2019 ఎన్నికల్లో మొదటిసారి జనసేన బరిలోకి దిగింది.

కమ్యూనిస్టులు, బిఎస్‌పి పొత్తు పొత్తుకుని పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో దిగారు. ఇక పవన్ గెలిచేస్తారని, ఆయన అభిమానులు గట్టిగా నమ్మారు. కానీ ఊహించని విధంగా ఆ ఎన్నికల్లో జనసేనకు షాక్ తగిలింది. ఆ పార్టీకి కేవలం ఒక సీటే వచ్చింది. పవన్ సైతం పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయారు. గెలిచిన ఎమ్మెల్యే కూడా వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. అలా అని పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన జనంలోకి వస్తే మళ్ళీ అదిరిపోయే స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఇక ఎప్పటిలాగానే జనసైనికులు, అభిమానులు సీఎం పవన్ అంటూ అరుస్తూనే ఉన్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని జనసైనికులు అనుకుంటూ ముందుకెళుతున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో కూడా పవన్‌కు అనుకూల పరిస్తితులు ఉన్నట్లు కనిపించడం లేదు. పైగా ఎప్పటిలాగానే పవన్ పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీంతో జనసేన పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. ఈ పరిస్తితిని చూస్తే పవన్ జన్మలో సీఎం అయ్యేలాగా కనిపించడం లేదు. ఇక అభిమానులే ఆయన్ని సీఎం అని పిలుచుకోవాలి.

Discussion about this post