రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. అలాగే నాయకులు ఎప్పుడు ఒకేలా ఉండరు. ఒకప్పుడు జీరోలు అనిపించుకున్నవారే ఇప్పుడు హీరోలు అవుతారు. అలాగే ముందు హీరోలు అనిపించుకున్నవారు ఇప్పుడు జీరోలు అవుతారు. అలా జీరో నుంచి హీరోగా నారా లోకేష్ మారితే…హీరో నుంచి జీరోగా జగన్ మారారని చెప్పొచ్చు.
లోకేష్….ఎంతకాదు అనుకున్న భవిష్యత్‌లో టీడీపీని నడిపించేది లోకేషే. అయితే లోకేష్‌కు పార్టీని నడిపించే కెపాసిటీ ఉందా?అంటే గతంలో సొంత పార్టీలో కూడా కొంత అనుమానాలు ఉండేవి…లోకేష్‌కు ఆ కెపాసిటీ లేదని. అలాగే ప్రత్యర్ధులు సైతం ఆయన మాట తీరు, బాడీ తీరుపై దారుణంగా మాట్లాడేవారు. కానీ ఆ విమర్శలన్నిటికి చెక్ పెడుతూ లోకేష్..ఓ మంచి నాయకుడుగా మారిపోయారు.గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి లోకేష్ తీరు మారింది. మాట తీరు మారింది. ఏ విషయన్నైనా అనర్గళంగా, స్పష్టంగా మాట్లాడుతూ ప్రత్యర్ధులపై కౌంటర్లు వేస్తున్నారు. మీడియా సమావేశాలైన, ట్విట్టర్, జూమ్ ఇలా ఏ ప్లాట్‌ఫామ్ అయినా సరే లోకేష్ దుమ్ముదులిపేస్తున్నారు. అలాగే తమ పార్టీ నేతలని, కార్యకర్తలని వైసీపీ వేధిస్తే, వారికి అండగా నిలబడుతున్నారు. ఇంకా ఊహించని స్థాయిలో మాట్లాడుతూ ఓ మాస్ లీడర్ మాదిరిగా మారిపోయారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, నిత్యం జగన్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలా తక్కువ సమయంలోనే లోకేష్ జీరో నుంచి హీరోగా మారి ప్రజలకు చేరువయ్యాడు.
అదే సమయంలో జగన్ హీరో నుంచి జీరో గా మారి ప్రజలకు దూరమయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ, ఏ స్థాయిలో జగన్ మాట్లాడేవారో అందరికీ తెలిసిందే. స్క్రిప్ట్‌లు రాసుకున్న సరే ప్రజల మధ్యలో దూకుడుగా మాట్లాడి ఆకట్టుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో గెలవగలిగారు. సీఎం అయ్యాక జగన్‌లో మునుపటి దూకుడు లేదు. అసలు ప్రజల మధ్యలోకి రావడం లేదు.మీడియా సమావేశాల్లో స్పష్టంగానే మాట్లాడలేకపోతున్నారు. స్క్రిప్ట్ రాసుకుని, ఎదురుగా పేపర్ పెట్టుకున్నా సరే అనర్గళంగా మాట్లాడలేకపోతున్నారు. ఒకోసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో సొంత పార్టీ వాళ్లకే అర్ధం కావడం లేదు. పైగా మీడియా సమావేశాలు రికార్డ్ చేసి పెడుతున్నారు. ఇలా జగన్ నాయకుడుగా ఫెయిల్ అయిపోయారు. మొత్తానికైతే అసలైన నాయకుడుగా లోకేష్ ఉంటే, జగన్ ప్రజలకు దూరం దూరంగా జరుగుతోన్న పరిస్థితి.
Discussion about this post