జగన్ అధికారంలోకి వచ్చాక బాదుడుకు ఏది అనర్హం కాదు అన్నట్లుగా పరిస్తితి నడుస్తోంది. ఊహించని రీతిలో ప్రతి దానిపై జగన్ ప్రభుత్వం వడ్డన ఉంటుంది. దీని వల్ల ప్రజలపై విపరీతమైన భారం పడుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉండగా జగన్…చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి బాదుడే బాదుడు అంటూ విమర్శలు చేశారు. కానీ అప్పుడు ఎలాంటి బాదుడు లేకపోయినా కేవలం రాజకీయం కోసం హడావిడి చేశారు. ఎలాగైతే చంద్రబాబుని నెగిటివ్ చేసి జగన్ అధికారంలోకి వచ్చారు.

ఇక జగన్ ఎంట్రీ ఇచ్చాక రాష్ట్రంలో పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జననన్న బాదుడుకు అడ్డు లేకుండా పోయిందని ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌లపై సెపరేట్ బాదుడు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ నానా రకాలుగా పన్నులు వేసి ప్రజలపై పెనుభారం మోపారు. ఇలా ఒకటి ఏంటి అనేక అంశాలపై జగన్ ప్రభుత్వం బాదుడు షురూ చేసింది.

గత చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మీద భారం వేయకుండా, దాన్ని ప్రభుత్వమే భరించింది. ఇప్పటికే పలుమార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న జగన్, తాజాగా ట్రూ అప్ పేరు కొత్తగా బాదుడు షురూ చేశారు. దీని వల్ల కరెంట్ బిల్లులు తడిచి మోపెడు అవుతున్నాయి. ఈ నెల నుంచి రాబోయే ఎనిమిది నెలల వరకు రూ.3,660 కోట్లు అదనంగా ప్రజల దగ్గర నుంచి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది.

కానీ జగన్ ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి ప్రజలపై భారం మోపింది. కరెంట్ బిల్లుపై అదనంగా యాభై శాతం ట్రూ అప్ పేరిట వసూలు చేస్తున్నారు. ఏదేమైనా జగనన్న బాదుడులో పిహెచ్‌డి తీసుకున్నట్లు ఉన్నారు.

Discussion about this post