నిన్న మొన్నటి వరకు ఎవరికివారుగా ఉన్న విజయవాడ టీడీపీ నేతలను.. తాజాగా జరిగిన పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమం ఒక్కటి చేసింది. నిజానికి స్థానిక ఎన్నికల నాటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా మేయర్ పీఠంపై జరిగిన వివాదంతో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా సెంట్ర ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇతర నేతలు.. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకు న్నారు. దీంతో చాలా రోజులు.. నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఎవరికివారుగానే కార్యక్ర మాలు నిర్వహించారు.

కానీ, తాజాగా జరిగిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో నాయకులు అందరూ ఒక్కటయ్యారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ పరిణామం నిజంగానే ఆహ్వానిందగిన పరిణామంగా ప రిశీలకులు చెబుతున్నారు. అయి తే.. ఇది మున్ముందుకూడా కొనసాగుతుందా? అనేది చూడాలి. ఇప్పటి వరకు ఉన్నపరిణామాలను గమని స్తే.. ఈ ఐక్యత కొనసాగడం కష్టమేనని అంటున్నారు. అదేసమయంలో మిగిలిన నేతలను గమనిస్తే.. పశ్చి మ నియోజకవర్గంలో వివాదాలు అలానే కొనసాగుతున్నాయి.

తాజాగా జరిగిన నిరసనలో పశ్చిమ నియోజక వర్గానికి చెందిన నాయకులు ఒక్కరూ కూడా పాల్గొనలేదు. ప్రధానంగా ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మరోనేత నాగుల్ మీరాల మధ్య కూడా వివాదాలు కొనసాగుతున్నాయి. అదేసమయంలో ఎంపీ కేశినేని నాని కూడా.. ఎక్కడా ఎవరికి ఆయన అసలు అందుబాటులో ఉండడం లేదు. ఈయన కూడా నిరసనకు దూరంగానే ఉన్నారు.

ఇక, వీరిని కూడా కలుసుకునేలా చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేస్తే.. పార్టీ పుంజుకునే అవకాశం మెండు గా ఉందని అంటున్నారు. మరోవైపు.. వైసీపీలో నేతల మద్య విభేదాలు అలానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఇప్పుటు టీడీపీకి అత్యంత అవసరం అంటున్నారు పరిశీలకులు . మరి ఏం చేస్తారో చూడాలి.

Discussion about this post