చంద్రబాబు అంచనాలు చాలా సార్లు కరెక్టు అయ్యాయి. అలాగే చాలా సార్లు తప్పు కూడా అయ్యాయి. అపర చాణక్యుడు అని బిరుదు బాబుకు ఉంది కానీ అది అన్ని వేళలా చెల్లలేదు అని తమ్ముళ్ళే ఒప్పుకుంటారు. 2004లో అలిపిరి ఘటన సానుభూతితో అధికారంలోకి వస్తామని ఆశపడిన చంద్రబాబు నేరుగా వైఎస్సార్ కి చాన్స్ ఇచ్చేశారు. అప్పటికే పాదయాత్రతో మంచి దూకుడు మీద ఉన్న వైఎస్సార్ బ్రహ్మాండమైన మెజారిటీతో సీఎం అయిపోయారు. అలాగే 2018లో బీజేపీకి విడాకులు ఇచ్చి తప్పులన్నీ ఆ పార్టీ మీదకు తోసేసి తాను గెలవాలనుకున్నారు చంద్రబాబు. కానీ అది జగన్ కి మంచి అడ్వాంటేజ్ అయింది.
ఇక ఇపుడు చూస్తే రెండేళ్ల తరువాత జగన్ మీద భారీ వ్యతిరేకత వచ్చిందని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. యద్భావం తద్భవతి అన్న సందేశం తెలిసిందే. ఎవరికి ఏ విధంగా తోసే అంతటా అలాగే కనిపిస్తుందిట. తనకు అనుకూలంగా ఉండే మీడియా రాసే రాతలకు ప్రభావితం అయిపోవడం బాబుకు మొదటి నుంచి అలవాటు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అలా ఉన్నాయా లేవా అన్నది ఆయన వాకబు చేయడంలేదు. నిజానికి గత రెండేళ్లలో టీడీపీ ఎక్కడ గెలిచింది అన్న ప్రశ్న వేసుకుంటే స్ట్రాటజీ మరోలా ఉండేదిఇక చంద్రబాబు చేస్తున్న మరో తప్పు యాంటీ ఇంకెంబెన్సీ మీద ఆధారపడడం. భారతీయ రాజకీయాల్లో ఇది చాలా ఎక్కువ. తాము ఎన్నుకునే పార్టీలో ఉండే మంచి కంటే అధికారంలో ఉన్న పార్టీ చెడ్డను చూసే కసిగా ప్రతిపక్షాన్ని చంకెనెత్తుకుంటారు. అలా మోడీ కూడా 2014లో గెలిచారు. 1983లో ఎన్టీయార్ గెలిచినా, 2004లో వైఎస్సార్ అయినా 2019 జగన్ అయినా యాంటీ ఇంకెంబెన్సీ వల్లనే. అయితే చంద్రబాబు 1999లో వరసగా రెండవసారి గెలిచారు. అలాగే వైఎస్సార్ కూడా 2009లో గెలిచారు.
మరి దాని మాటేంటి. అంటే తమకు నచ్చినట్లుగా ప్రభుత్వాల పాలన ఉంటే జనాలు విపక్షాలను అసలు పట్టించుకోవు. జగన్ అదే పనిలో ఇపుడు బిజీగా ఉన్నారు. 2024లో బాబుకు ఓడించేస్తే ఒక పని అయిపోతుంది అన్నది జగన్ ఆలోచన. మరి దాన్ని తెలుసుకోకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తామని ఊకదంపుడు ప్రసంగాలు చేయడం వల్ల ఉపయోగం ఉందా. టీడీపీ ఏపీలో రావాలని జనాలు కోరుకుంటున్నారా. అలాంటి వాతావరణం టీడీపీ క్రియేట్ చేస్తోందా. అది జరిగిన నాడే బాబు ఆశలకు ఒక సార్ధకత ఉంటుందేమో..!
Discussion about this post